టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు ఆయన వరుణ్ తేజ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వరుణ్ తేజ్, పూజా హెగ్డే హీరోయిన్ గా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ముకుంద మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత కంచె , తొలిప్రేమ , ఎఫ్2 , గద్దల కొండ గణేష్ మూవీ లతో టాలీవుడ్ ఇండస్ట్రీ లో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వరుణ్ తేజ్  కొంతకాలం క్రితమే గని అనే మూవీలో హీరోగా నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదలైన గని మూవీ ప్రేక్షకులను ఏ మాత్రం అలరించలేక పోయింది. దానితో చివరగా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని సాధించింది. గని మూవీ తర్వాత వరుణ్ తేజ్ 'ఎఫ్ 3' మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు.  

భారీ అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఎఫ్ 3 మూవీ కూడా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయింది. ఇలా  వరుణ్ తేజ్ వరుసగా గని , ఎఫ్ 3 రెండు మూవీ లతో అపజయాలను బాక్సాఫీస్ దగ్గర అందుకున్నాడు. కొంత కాలం క్రితమే వరుణ్ తేజ్ టాలీవుడ్ యంగ్ దర్శకుడు ప్రవీణ్ స్టేటస్ దర్శకత్వంలో ఒక మూవీలో నటించబోతున్నట్లు అనౌన్స్ చేశాడు. కాక పోతే వరుసగా రెండు సినిమాలు విజయం సాధించకపోవడంతో ప్రవీణ్ సత్తార్ మూవీ ని వరుణ్ తేజ్ కొన్ని రోజుల పాటు హోల్డ్ లో పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.  ప్రవీణ్ సత్తార్ ప్రస్తుతం ది ఘోస్ట్ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా రిజల్ట్ ని బట్టి ప్రవీణ్ సత్తార్ తో మూవీ చేయాలా ...  లేదా అనేది వరుణ్ తేజ్ నిర్ణయించుకొనున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇలా వరుస అపజయాలతో వరుణ్ తేజ్ ఆలోచనలో పడట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: