మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ఒకేసారి మూడు చిత్రాలలో నటిస్తున్న విషయం తెలిసిందే. రెండు సినిమాలకు సంబంధిం చిన షూటింగులు పూర్తి కాగా ఆ సినిమాల యొక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇప్పుడు శెరవేగంగా జరుపుకుంటున్నాయి. మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందిన గాడ్ ఫాదర్ చి త్రం ఈ దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అయితే ఈ సినిమా ఏ తేదీన విడుదలవుతుం దో అన్న క్లారిటీ మాత్రం ఇప్పటిదాకా రాలేదు.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలను ఏ విధంగా నిర్వహించాలో అన్న చర్చలు జరుగుతు న్నాయి. ఇక మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన మరొక సినిమా భోళా శంకర్ చిత్రం యొక్క షూటింగ్ కూడా పూర్తయింది. దీనికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తమిళ చిత్రానికి రీమేక్ కాగా తెలుగు ప్రేక్షకులకు నచ్చే విధంగా స్క్రిప్ట్ లో పలు మార్పులు చేసి ఈ చిత్రాన్ని రూపొందిం చారు.కీర్తి సురేష్ మెగాస్టార్ చిరంజీవికి చెల్లెలుగా నటిస్తుంది.  

ఇక బాబీ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించబోయే సినిమా యొక్క షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుగు తుంది. రవితేజ ఓ కీలక పాత్రలో నటిస్తూన్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా చేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ మూడు సినిమాలు కు సంబంధించిన అప్డేట్లు త్వరలో రాబోతున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే మె గాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలకు సంబంధించిన అప్డేట్లు రాబోతున్నాయని తెలియడంతో ఒకసారిగా అభిమానులు ఎంతో సంతోషం నెలకొంది. మెగాస్టార్ చిరం జీవి సైరా చిత్రం తర్వాత చేసిన ఆచార్య భారీ ఫ్లాప్ అయిన నేపథ్యంలో ఈ సినిమాను పెద్ద హిట్ చేయాలని ఆయన భావిస్తున్నాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: