విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లైగర్ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జోరుగా జరుగుతున్నాయి. ఢిల్లీ చత్తీస్గడ్, పంజాబ్ అంటూ నార్త్ లో తన స్టామినా చాటిన విజయ్ దేవరకొండ ఇప్పుడు సౌత్ లో కూడా తన క్రేజ్ ను పెంచుకునే విధంగా ప్లాన్ వేశాడు ఇప్పటికే వరంగల్లో తన సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసిన విజయ్ దేవరకొండ ఆ తర్వాత ప్రమోషన్ కార్యక్రమాల స్పీడ్ పెంచాడు.

అయితే ఇన్ని ప్రమోషన్ కార్యక్రమాల మధ్య కూడా విజయ్ దేవరకొండ తన అభిమానులను ఏమా త్రం మరిచిపోలేదు అని చెప్పడానికి ఇదొక చక్కటి ఉదాహరణ. వాస్తవానికి హీరోలు తాము ఫ్రీగా ఉన్న సమయంలో అభిమానుల కోసం కొంత సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. వారితో టైమ్ స్పెండ్ చేస్తూ ఉంటారు. అలా విజయ్ దేవరకొండ తాజాగా అభిమానుల తో తన ఫోటోషూట్ నిర్వహించడం విశేషం. దాదాపు 3 వేలకు మందికి పైగా ఈ ఫోటోషూట్ కార్యక్రమాన్ని నిర్వహించి తనకు అభిమానుల పట్ల ఎంతటి ప్రేమ ఉందో తెలియజేశాడు. 

ఈ కార్యక్రమానికి పలు ప్రాంతాల నుంచి అభిమానులు తరలిరాగా కొన్ని సదుపాయాలు సమకూర్చి మరి ఈ కార్యక్ర మాన్ని నిర్వహించడం విశేషం. మరి అభిమానుల ఆశీర్వాదాలు అందుకున్న విజయ్ దేవరకొండ ఈ సినిమాతో ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటాడో చూడాలి. చాలా రోజుల తర్వా త ఆయన పాన్ ఇండియా సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందిన విషయం అందరికీ తెలిసిందే. ఐదు భాషలలో ఈ చిత్రం విడుదల  కాబోతుండగా అభిమాను లు ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్స్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఫ్రీ రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో కలగగా ఈ సినిమా ఇప్పుడు ఎలా ప్రేక్షకుల ను ఆకట్టుకుంటుందో చూద్దాం. 
  

మరింత సమాచారం తెలుసుకోండి: