సినిమా పరిశ్రమలో సక్సెస్ ఉన్న వారి చుట్టే అందరూ తిరుగుతూ ఉంటారు. ముఖ్యంగా దర్శకులు విజయాన్ని సాధిస్తే మాత్రం తప్పకుండా సదరు దర్శకుడికి మంచి మంచి హీరోలు అవకాశాలు ఇస్తామని వెంటపడుతూ ఉంటారు. ఆ విధంగా ఇటీవల ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఓ సినిమా ప్రేక్షకులను విపరీతంగా మెప్పించడంతో ఆ సినిమాకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ కు డిమాండ్ బాగా పెరిగిపోతుంది అని చెప్పాలి. వాస్తవానికి డైరెక్టర్లకు డిమాండ్ రావడం అనేది ఎంతో మంచి విషయం అనే చెప్పాలి.

ప్రేక్షకులను అలరించాలంటే ముందుగా దర్శకుడు కథ వల్లే సాధ్యం అవుతుంది. అలా కార్తికేయ సినిమాతో చాలా రోజుల తర్వాత భారీ విజయాన్ని అందుకున్నాడు హీరో నిఖిల్. ఈ సినిమా దర్శకుడు చందు మొండేటి కూడా చాలా రోజుల తర్వాత విజయాన్ని అందుకున్నాడు. ఈ డైరెక్టర్ తెలుగు ప్రేక్షకులను గతంలో మంచి సినిమాల తో పరిచయం అయిన వాడే. కార్తికేయ సినిమాతో తనలోని దర్శక ప్రతిభ ను చాటిచెప్పిన ఈ దర్శకుడు ఆ తరువాత ప్రేమమ్ అనే ఒక క్లాసికల్ ప్రేమ కథా చిత్రాన్ని రూపొందించి మంచి విజయాన్ని అందుకున్నాడు. అయితే మధ్యలో కొన్ని ఆటుపోట్లు ఎదురైనా కూడా తనకు అచ్చి వచ్చిన కార్తికేయ సినిమాకు సీక్వెల్ చేయాలని భావించాడు. ఆ విధంగా కార్తికేయ 2 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఇప్పుడు ఇంతటి భారీ విజయాన్ని అందుకుంది. 
వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావలసి ఉంది. కొన్ని కారణాలవల్ల ఈ సినిమా విడుదల కాలేక పోయింది. దాంతో ఎన్నో ఇబ్బందుల మధ్య విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడం ఇండస్ట్రీకి కొత్త ఊపిరిని అందించినట్లు అయింది. ఒక మంచి కథను రూపొందించి సినిమాలు చేసిన దర్శకుడు చందు మొండేటి నీ ప్రతి ఒక్కరు కూడా ప్రశంసించారు. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మంచి కలెక్షన్లు వస్తున్నాయని చెబుతున్నారు. మరి ఈ దర్శకుడు ఈ సినిమా తర్వాత ఏ హీరోతో సినిమాను చేస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: