వర్సటైల్ యాక్టర్ ఆనంద్ దేవరకొండ హీరో గా నటిస్తున్న తాజా సినిమా 'హైవే'. కెవి గుహన్ దర్శకుడు. తొలి మూడు సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుని నటుడిగా స్థిరపడ్డ ఆనంద్ దేవరకొండ ఇప్పుడు ఓ సైకో థ్రిల్లర్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా లో ఆగస్టు 9 వ తేదీన ఈ సినిమా రాబోతుంది. తాజాగా ఈ సినిమా యొక్క ట్రైలర్ లాంచ్ జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రైలర్ ని విడుదల చేసింది చిత్ర బృందం. హైవేపై ట్రాక్ లో వెళుతూ కనిపించిన యువతులని అత్యంత కిరాతకంగా మర్డర్ లు చేసే ఓ సైకో చుట్టూ సాగే కథ ఇది అని సినిమా ట్రైలర్ ను బట్టి తెలుస్తుంది. 

అలా హీరో సహాయం కోరిన యువతి సైకో బారిన పడిందా అనేది ఈ సినిమా కథ. సైకో కిల్లర్ ని వెతికే పోలీస్ ఆఫీసర్ పాత్రలో 'రేయ్' ఫేమ్ సయామీ ఖేర్ నటించింది.తొలి మూడు సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ హీరో నటుడిగా తనని తను నిరూపించుకుని ఇప్పుడు కమర్షియల్ హీరోగా ఎదగడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే ఇప్పుడు ఈ థ్రిల్లర్ జోనర్ లో సినిమా చేయడం దేవరకొండ అభిమానులకు కొత్త అనే చెప్పాలి. ఒకవైపు అన్న విజయ్ దేవరకొండ దేశం మొత్తం షేక్ చేయాలనీ లైగర్ సినిమా చేస్తుండగా ఇంకొకవైపు ప్రస్తుత పరిస్థితులలో సినిమా ను దియేటర్ లలో సినిమా ను విడుదల చేయకుండా ఒటీటీ లో సినిమా ను విడుదల చేయడం నిజంగా విశేషం అనేచెప్పాలి.

మరి అయన గత సినిమా పుష్పక విమానం సినిమా ప్రేక్షకులకు పెద్దగా నచ్చని నేపథ్యంలో ఈ చిత్రం ఎలా ఉంటుందో అనేది ఇక్కడ అసలు ప్రశ్న. సినిమాటోగ్రాఫర్ గా గుహన్ కు ఎంతో మంచి అనుభవం ఉంది. దర్శకుడిగా కోడా అయన కొన్ని మంచి సినిమాలు చేయగా అయన దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. మానససినిమా హీరోయిన్ గా నటిస్తుంది. ఆగస్ట్19 న విడుదల కాబోతున్న ఈ సినిమా అః లో మంచి క్రేజ్ తెస్తుందని అందరు భావిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: