సినిమా పరిశ్రమలో హీరోలు ఎక్కువ రోజులు ముందుకు వెళ్లాలంటే క్రేజ్ పెంచుకోవాలి అంటే వారు తప్పకుండా మాస్ సిని మాలను చేయవలసి ఉంటుంది. అప్పుడే వారికి భారీ స్థాయిలో అభిమానులు ఏర్పడతారు. ఆ విధంగా క్లాస్ చిత్రాలతో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న అక్కినేని నాగచైతన్య ఇప్పుడు మాస్ ఫాలోయింగ్ పెంచుకోవడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లుగా ఆయన కదలికలను బట్టి తెలుస్తుంది.

ఇటీవల ఆయన హీరోగా చేసిన థాంక్యూ ప్రేక్షకులను ఏ మాత్రం నేర్పించకపోవడంతో ఇప్పుడు చేయబోయే సినిమాలు అం దరి ప్రేక్షకులను అలరించే విధంగా ఉండాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ విధంగా ఆయనను మాస్ హీరోగా నిలబెట్టే బాధ్యతను నిర్మాత దిల్ రాజుకు అప్పగించినట్లు తెలుస్తుంది. ఇప్పటికే వెంకట ప్రభు దర్శకత్వంలో ఒక వెరైటీ సినిమాను చేస్తున్న నాగచైతన్య ఆ తరువాత గీతా ఆర్ట్స్ సంస్థతో కలిసి పరశురామ్ దర్శకత్వంలో మాస్ మసాలా సినిమాను చేస్తున్నాడు.

అలా ఈ రెండు సినిమాలు రెండు వేరు వేరు జోనర్ సినిమాలు కావడంతో ఈ చిత్రాలపై అందరిలో మంచి అంచనాలే ఉన్నాయి. ఈ నేప థ్యంలో ఈ రెండు సినిమాల తరువాత దిల్ రాజు బ్యానర్ లో ఓ సినిమా చేయాలని  చైతు భావిస్తున్నాడు. దానికి సంబంధించి ఒక మాస్ దర్శకుడుని ఎంపిక చేయాలని దిల్ రాజుకు నాగచైతన్య సూచించాడట. అలా ఒక మాస్ కథను రెడీ చేస్తున్నాడట దిల్ రాజు. మరి వీరి కాంబినేషన్ లో వచ్చిన థాంక్యూ సినిమా భారీ ఫ్లాప్ అవడంతో ఇప్పుడు చేయబోయే సినిమా అయినా మంచి విజయాన్ని తెచ్చి పడుతుందా అనేది చూడాలి.  అక్కినేని వంశంలో హీరో గా నిలదొక్కుకున్న నాగచైతన్య ఇప్పుడు హిట్ కోసం ఇబ్బంది పడుతున్నా డనే చెప్పాలి. మరి ఈ సారి హిట్స్ కొట్టి ఈ హీరో స్టార్ గా ఎదుగుతాడా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: