దర్శకులు కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి సినిమాలు తీస్తూ ఉంటారు.. కానీ తప్పకుండా హిట్ అవుతుంది అని మాత్రం ఎవ్వరూ చెప్పలేరు.. ఎందుకంటే అదంతా ప్రేక్షకుల చేతిలో ఉంటుంది. కానీ దర్శకుడు మాత్రం హిట్టవుతుందనే నమ్మకం తోనే సినిమాలు చేస్తూ ఉంటారు. కానీ కొన్నిసార్లు అంచనాలు తారుమారు అయిపోతూ ఉంటాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే  ఒక సినిమా వల్ల వచ్చే లాభాలు మరో సినిమా వల్ల పోవడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఇక ప్రస్తుతం డిస్ట్రిబ్యూటర్ గా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న ప్రముఖ నిర్మాత సుధాకర్ రెడ్డి విషయంలో కూడా ఇదే జరిగింది అని తెలుస్తోంది.


 హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ఎన్నో ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూటర్ గా పని చేస్తున్నారు. సినిమాలను పంపిణీ చేసి లాభాలు కూడా అందుకున్నారు. అయితే అప్పట్లో అఖిల్ సినిమాతో నిర్మాతగా కొంత నష్టపోయారు సుధాకర్ రెడ్డి. మొన్న లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా నటించిన విక్రమ్ సినిమాను తెలుగులో సమర్పించగా ఈ సినిమా సక్సెస్ అందుకుంది. దీంతో సుధాకర్ రెడ్డి  ఎన్నో లాభాలను చూశారు.  ఇక ఈ లాభాల కారణంగా గత కొన్ని రోజుల నుంచి సుధాకర్ రెడ్డి హాట్ టాపిక్ గా మారిపోయారు. అయితే సుధాకర్ రెడ్డిసక్సెస్ ని ఎంజాయ్ చేసే లోపే మరోసారి నష్టాలు తప్పలేదు.


 నితిన్ హీరోగా రాజశేఖర్ అనే ఎడిటర్ డైరెక్టర్ గా మారి చేసిన సినిమా మాచర్ల నియోజకవర్గం. భారీ అంచనాల మధ్య ఈ సినిమా తెరకెక్కింది. ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమా హిట్ అవ్వడం ఖాయం అని అందరూ అనుకున్నారు. పూర్తి సినిమా చూస్తే కానీ అర్థం కాలేదు సినిమాలో అంత పస లేదు అని. మొదటిరోజు నెగెటివ్ టాక్ సొంతం చేసుకుంది. భారీ అంచనాలు ఉండటంతో ఓపెనింగ్స్ ఫర్వాలేదనిపించినా ఆ తర్వాత మాత్రం ఒక్కసారిగా కలెక్షన్స్ తగ్గిపోయాయి. అదేసమయంలో కార్తికేయ 2 హిట్ కొట్టడంతో అటు మాచర్ల నియోజకవర్గం చూసే వారే లేకుండాపోయారు. తద్వారా మొన్న విక్రమ్ సినిమాతో లాభాలు.. ఇక ఇప్పుడు మాచర్ల నియోజకవర్గంతో నష్టాలు తప్పలేదు అనేది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: