పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక మంచి కట్ అవుట్, ఎంతోమంది అమ్మాయిల కలల రాకుమారుడు గా మారిపోయిన ప్రభాస్ అంటే ఇష్టం లేనివారు ఎవరూ ఉండరు.ఈయనను సినిమాల పరంగా కాదు వ్యక్తిత్వపరంగా కూడా ప్రభాస్ నీ ఎక్కువగా ఇష్టపడే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుందని చెప్పాలి.పోతే 4 పదుల వయసు దాటడానికి సమయం దగ్గర పడుతున్నప్పటికీ ఆయన ఇంకా వివాహం చేసుకోకపోవడంతో పలువురు పలు రకాలుగా వార్తలు వైరల్ చేస్తున్నారు. ఇకపోతే  గతంలో త్రిష తో ప్రేమాయణం నడిపాడు అని, అందుకు కృష్ణంరాజు ఒప్పుకోలేదని అందుకే పెళ్లికి దూరంగా ఉన్నాడు ప్రభాస్ అంటూ వార్తలు వైరల్ అయ్యాయి.

ఆ తర్వాత కాలం నుంచి ఇప్పటివరకు ప్రముఖ స్టార్ హీరోయిన్ అనుష్కతో ప్రేమాయణం నడుపుతున్నాడు అని అందుకే ఆమెను వివాహం చేసుకోలేదని అనుకుంటున్నట్లు కూడా వార్తలు వినిపించాయి.ఇదిలావుంటే  మరొక విశేషం ఏమిటంటే అక్కడ అనుష్క కూడా వయసు మీద పడుతున్నా ఇంకా వివాహానికి మాత్రం అంగీకరించలేదు.అయితే  దీన్ని బట్టి చూస్తే వీరిద్దరి మధ్య ఏదో ఉందనే విషయం కూడా స్పష్టమవుతుంది. అయితే కానీ ఏ ఒక్కరు కూడా ఈ విషయంపై స్పందించకపోవడం గమనార్హం. ఇకపోతే  నిన్నటికి నిన్న ఎన్నో రోజుల నుంచి సోషల్ మీడియా ఖాతాలో ప్రొఫైల్ ఫోటో మార్చని వీరు ఒకేసారి ఇద్దరూ మార్చడంతో కూడా పలు అనుమానాలకు దారి తీసింది.అయితే ఎవరు ఎన్ని అనుమానాలు,

 పుకార్లు షికార్లు చేసినా ప్రభాస్ పెళ్లి చేసుకోలేదు అనేది మాత్రం వాస్తవం. ఈ విషయంపై ప్రభాస్ తల్లి స్వయంగా స్పందించారు.  అతడి లవ్ ఫెయిల్యూర్ కారణంగానే ప్రభాస్ వివాహం చేసుకోలేదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. అసలు విషయంలోకి వెళితే… ప్రభాస్ తల్లి మాట్లాడుతూ.. ప్రభాస్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం తన ఫ్రెండ్ రవి అంటూ చెప్పుకొచ్చింది . అయితే రవి, ప్రభాస్ ఇద్దరూ చిన్నతనం నుంచి చాలా క్లోజ్ ఫ్రెండ్స్.ఇక  ఇప్పటికీ కూడా అలాగే ఉంటారు. కాగా ప్రభాస్ ఎంత బిజీగా ఉన్నా సరే అతనితో మాత్రం ఖచ్చితంగా మాట్లాడతాడు.అయితే  అతనిది లవ్ ఫెయిల్యూర్.. ఇప్పటికే 45 సంవత్సరాలు దాటిపోయాయి. పోతే పెళ్లి ధ్యాస లేకుండా సింగిల్గానే ఉన్నాడు. అతడే ప్రభాస్ కి పెళ్లి అంటే భయం పుట్టేలా చేసి ఉంటాడు అంటూ ఆమె బాధపడుతోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: