పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొంత కాలం క్రితమే భీమ్లా నాయక్ మూవీ తో ప్రేక్షకులను అలరించిన విషయం మనకు తెలిసిందే . మలయాళ మూవీ అయ్యప్పనున్ కొషియన్ మూవీ కి అధికారిక రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీ బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది . ఇది ఇలా ఉంటే భీమ్లా నాయక్ తో పాటే పవన్ కళ్యాణ్ హరి హరి వీరమల్లు షూటింగ్ ను కూడా మొదలు పెట్టాడు .

ఇప్పటికే భీమ్లా నాయక్ సినిమా షూటింగ్ పూర్తి అయ్యి  విడుదల కాగా ,  హరిహర షూటింగ్ మూవీ మాత్రం కొన్ని అనివార్య కారణాల వల్ల షూటింగ్ కూడా ఇప్పటి వరకు పూర్తి కాలేదు . మధ్యలో కొంత కాలం పాటు ఆగిపోయిన హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ కొంత కాలం క్రితమే తిరిగి స్టార్ట్ రీ స్టార్ట్ అయ్యింది . తిరిగి రీ స్టార్ట్ అయిన తర్వాత కొంత భాగం షూటింగ్ పూర్తి కాగానే మళ్లీ ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది .

గత కొంత కాలంగా ఈ మూవీ షూటింగ్ అప్పుడు మొదలు కాబోతుంది ... ఇప్పుడు మొదలు కాబోతుంది ... అంటూ అనేక వార్తలు బయటకు వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ వచ్చే నెల అనగా సెప్టెంబర్ నెల నుండి రీ స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. హరిహర వీరమల్లు మూవీ కి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తుండగా ,  అందాల ముద్దు గుమ్మ నిధి అగర్వాల్మూవీ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ పై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: