ప్రముఖ రియాలిటీ షో లలో ఒకటి అయిన బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా బుల్లి తెర అభిమానులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . మొదట ఇండియా లో  హిందీ లో ప్రారంభం అయిన బిగ్ బాస్ రియాలిటీ షో హిందీ బుల్లి తెర ప్రేక్షకులను ఎంత గానో అలరించడం తో ఇండియా లోని అనేక భాషలలో కూడా బిగ్ బాస్ రియాలిటీ షో లను ప్రారంభించారు .

అందులో భాగంగా తెలుగు లో కూడా ఈ బిగ్ బాస్ రియాలిటీ షో ను ప్రారంభించారు . ఇప్పటి వరకు విజయ వంతంగా తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షో 5 సీజన్ లను పూర్తి చేసుకోగా , తెలుగు బిగ్ బాస్ 'ఓ టి టి' ఒక సీజన్ ను విజయవంతంగా పూర్తి చేసుకుంది . ఇది ఇలా ఉంటే తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్ 6 కి అంతా సిద్ధం అయ్యింది . బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 సెప్టెంబర్ 4 వ తేదీ నుండి గ్రాండ్ గా ప్రారంభం కాబోతోంది.

అందులో భాగంగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 లో పాటిస్పేట్ చేయబోయే కంటెస్టెంట్ లకు సంబంధించి ఒక లిస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆ లిస్ట్ లో ఉన్న వారు ఎవరో తెలుసుకుందాం. ఉదయభాను, శ్రీ సత్య, చలాకీ చంటి, అర్జున్ కల్యాణ్, ఇనయా సుల్తానా, బాలాదిత్య, సుదీప, శ్రీహన్, వాసంతి కృష్ణన్, ఆదిరెడ్డి, విశాల్ రాజ్, ఆరోహి రావ్, గీతు రాయల్, రేవంత్ లు ఈ లిస్ట్ లో ఉన్నారు. వీరు బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 లో పాల్గొనబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: