మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే రామ్ చరణ్ ఎన్నో విజయవంతమైన మూవీ లలో హీరోగా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న రామ్ చరణ్ కొంత కాలం క్రితం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకున్నాడు.

మూవీ లో రామ్ చరణ్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా హీరోగా నటించాడు. ఇలా ఆర్ ఆర్ ఆర్ మూవీ తో అద్భుతమైన విజయాన్ని అందుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తూండగా, ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు.  ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ కొంత భాగం పూర్తి అయ్యింది. ఇది ఇలా ఉంటే గతంలో దర్శకుడు శంకర్ ఇండియన్ 2 మూవీ షూటింగ్ ని కొంత భాగం పూర్తి చేసిన విషయం మనకు తెలిసిందే.

కొన్ని కారణాల వల్ల ఆగిపోయిన ఇండియన్ 2 మూవీ షూటింగ్ ని శంకర్ మళ్ళీ తిరిగి ప్రారంభించబోతున్నారు. అలా శంకర్ 'ఇండియన్ 2' మూవీ ని తిరిగి ప్రారంభించడంతో రామ్ చరణ్ , శంకర్ మూవీ కొన్ని రోజులు ఆగి పోయే చాన్స్ ఉంది. దానితో రామ్ చరణ్ , గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రేజీ కాంబినేషన్ మూవీ కి సంగీత దర్శకుడిగా అనిరుద్ రవిచంద్రన్ ని మూవీ యూనిట్ ఎంచుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: