మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే ఈ సంవత్సరం కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కిన ఆచార్య మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు . భారీ అంచనాల నడుమ విడుదలైన ఆచార్య మూవీ మెగా అభిమాను లతో పాటు మాములు సినీ ప్రేమికులను కూడా తీవ్ర నిరుత్సాహ పరిచింది . ఇలా ఆచార్య మూవీ తో ప్రేక్షకులను నిరుత్సాహపరిచిన చిరంజీవి ఈ సంవత్సరం దసరా కానుకగా తాను హీరోగా నటిస్తున్న గాడ్ ఫాదర్ మూవీ ని విడుదల చేయబోతున్నాడు.

ప్రస్తుతం చిరంజీవి 'గాడ్ ఫాదర్' సినిమా డబ్బింగ్ పనులను పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఆగస్ట్ 22 వ తేదీన చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా గాడ్ ఫాదర్ మూవీ నుండి చిత్ర బృందం అదిరిపోయే అప్డేట్ ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి, మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ అనే మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో చిరంజీవి కి చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది.

మూవీ లో మెగాస్టార్ చిరంజీవి సరసన మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా కనిపించబోతోంది. ఈ మూవీ నుండి కూడా మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా అదిరిపోయే అప్డేట్ ని మూవీ యూనిట్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు సినిమాలతో పాటు మెగాస్టార్ చిరంజీవి, బాబీ దర్శకత్వంలో కూడా ఒక మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో శృతి హాసన్ హీరోయిన్ గా కనిపించబోతుంది. ఈ మూవీ నుండి కూడా మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఒక క్రేజీ అప్డేట్ ను విడుదల చేయనున్నట్లు సమాచారం. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అదిరిపోయే అప్డేట్ లతో మెగా అభిమానులకు చిరంజీవి ఫుల్ ట్రీట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: