శ్రీకాంత్ రెడ్డి , సంచిత ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఫస్ట్ డే ఫస్ట్ మూవీ కి వంశిధర్ దర్శకత్వం వహించగా , పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ అధినేత ఏడిద నాగేశ్వరరావు మనవరాలు శ్రీజ నిర్మాతగా శ్రీజ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో ఈ మూవీ ని నిర్మించారు . సెప్టెంబర్ 2 వ తేదీన ఈ మూవీ ని విడుదల చేయనున్నారు .

మూవీ విడుదల దగ్గర పడిన సందర్భం గా ఈ మూవీ దర్శకుడు అయి నటు వంటి వంశీధర్ తాజాగా ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ఈ మూవీ కి సంబంధించిన అనేక ఆసక్తికరమైన విషయాలను తెలియ జేసారు . తాజా ఇంటర్వ్యూ లో ఫస్ట్ డే ఫస్ట్ మూవీ దర్శకుడు వంశిధర్ మాట్లాడుతూ ... ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీ లో హీరో పేరు శ్రీను. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అభిమాని . అతను కాలేజీ లో ఒక అమ్మాయిని ఇష్ట పడుతూ ఉంటాడు . చాలా రోజుల తర్వాత ఆ అమ్మాయి శ్రీను తో మాట్లాడు తుంది .

పవన్ కళ్యాణ్ 'ఖుషి' మూవీ కి ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్స్ కావాలి అని అడుగుతుంది . ఆ మూవీ టిక్కెట్ లను సంపాదించడానికి శ్రీను ఎలాంటి ప్రయత్నాలు మరియు సాహసాలు చేశాడు అనేది ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది . ఈ మూవీ కథ మొత్తం రెండు రోజుల్లో జరుగుతుంది . ఈ మూవీ లో హీరో గోల్ ఫస్ట్ డే ఫస్ట్ షో టిక్కెట్లు సంపాదించడం. ఆ గోల్డ్ రీచ్ అయ్యే క్రమంలో లో చాలా సర్ప్రైస్ లు ఉంటాయి. ఈ కథ అందరికీ కనెక్ట్ అవుతుంది అని తాజాగా ఈ దర్శకుడు వంశిధర్ తెలియజేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: