టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది అనుపమ పరమేశ్వరన్. తన కెరీర్ లో కొన్ని హిట్టు సినిమాల్లో కూడా నటించింది. కానీ స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదగలేకపోయింది


అయినప్పటి కీ ఈమెకి అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఒకప్పుడు గ్లామర్ షోకి, ఆన్ స్క్రీన్ రొమాన్స్ కి దూరంగా ఉండే అనుపమ.. ఇప్పుడు లిప్ లాక్ సీన్స్ లో నటించడానికి కూడా ఒప్పుకుంటుందట.రీసెంట్ గా ఈమె నటించిన 'కార్తికేయ2' ప్రేక్షకుల ముందుకొచ్చింది.


సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. బాలీవుడ్ లో కూడా భారీ కలెక్షన్స్ ను వసూలు చేస్తుంది. ఈ సినిమా అనుపమకి బాగానే కలిసొచ్చినట్లు ఉంది. రీసెంట్ గా ఓ అగ్ర నిర్మాణ సంస్థ అనుపమ కు బాలీవుడ్ లో లాంచ్ చేయాలని నిర్ణయించుకుందట. ఇప్పటికే అనుపమకు కథ కూడా వినిపించినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయమై చర్చలు ఇంకా ముగింపు దశకు చేరుకోలేద ని సమాచారం. కొంతకాలం గా సౌత్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ల పై బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ లు ఆసక్తి చూపిస్తున్న విషయం తెలిసిందే.


 


టాలీవుడ్ లో టాప్ హీరోయిన్లు సమంత, పూజాహెగ్డేల కు బాలీవుడ్ లో ఎంత గా ఆఫర్స్ వస్తున్నాయో తెలిసిందే. ఇప్పుడు అనుపమకు కూడా బాలీవుడ్ మేకర్స్ అవకాశాలు ఇవ్వడానికి రెడీ అవుతున్నారట.. త్వరలో నే అనుపమ బాలీవుడ్ ప్రాజెక్ట్ ను అఫీషియల్ గా వెల్లడించనున్నారు. మరి హిందీ లో ఈ ముద్దుగుమ్మ ఎలాంటి ఫేమ్ తెచ్చుకుంటుందో చూడాలి మరి. ప్రస్తుతం ఈ బ్యూటీ 'డీజే టిల్లు' సీక్వెల్ లో నటిస్తోంది. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయట.. మరి చూడాలి అనుపమ టాలీవుడ్ లో రాని స్టార్ ఛాన్స్ బాలీవుడ్ లో వస్తుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: