మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస మూవీ లలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే . అందులో భాగంగా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ కి రీమేక్ గా తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ మూవీ లో కూడా హీరోగా నటిస్తున్నాడు . ఈ మూవీ కి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తుండ గా సల్మాన్ ఖాన్ , సత్య దేవ్ , పూరి జగన్నాథ్ , నయనతారమూవీ లో ముఖ్య పాత్రల్లో కనిపించ బోతున్నారు . 

మూవీ లో లేడీ సూపర్ స్టార్ నయనతార , మెగాస్టార్ చిరంజీవి కి చెల్లెలి పాత్రలో కనిపించబోతోంది . ఈ మూవీ కి సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు . ఈ మూవీ ని ఈ సంవత్సరం దసరా కానుకగా విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది . ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి ఒక అదిరిపోయే క్రేజీ అప్డేట్ ను విడుదల చేసింది . గాడ్ ఫాదర్ మూవీ టీజర్ విడుదల తేదీని తాజాగా ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది .

గాడ్ ఫాదర్ మూవీ టీజర్ ని 21 ఆగస్ట్ 2022 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. మరి ఈ మూవీ టీజర్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో చిరంజీవి , సల్మాన్ ఖాన్ కలిసి నటిస్తుండటంతో ఈ మూవీ పై మెగా అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికుల్లో కూడా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: