నిఖిల్ తాజాగా కార్తికేయ 2 మూవీ లో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే . ఈ మూవీ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా , చందు మొండేటి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు . ఈ మూవీ లో శ్రీనివాస్ రెడ్డి , వైవా హర్ష ఇతర ముఖ్యమైన పాత్రల్లో నటించారు . ఈ మూవీ ఆగస్ట్ 13 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యింది . మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ కి మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి పాజిటివ్ టాక్ రావడంతో ప్రస్తుతం ఈ మూవీ కి ప్రస్తుతం బాక్సా ఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ లో కలెక్షన్లు వస్తున్నాయి .

ఇది ఇలా ఉంటే కార్తికేయ 2 మూవీ కొన్ని సంవత్సరాల క్రితం విడుదలై మంచి విజయం సాధించిన కార్తికేయ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కింది. కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కడం తో కార్తికేయ 2 మూవీ పై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా సినీ ప్రేమికుల్లో మంచి అంచనాలు ఉన్న కారణంగా ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 12.80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ 13.30 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. ఇప్పటి వరకు 5 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకున్న కార్తికేయ 2 మూవీ ప్రపంచ వ్యాప్తంగా 21.50 కోట్ల షేర్ , 37.75 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. దీనితో 5 రోజులకు గాను కార్తికేయ 2 మూవీ ప్రపంచ వ్యాప్తంగా 8.20 కోట్ల లాభాలను సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: