బిగ్ బాస్.. బుల్లితెర పైనే బిగ్గెస్ట్ రియాలిటీ షో గా కొనసాగుతోంది. ఇక ఇప్పటికే తమిళ్, హిందీ బుల్లితెరపై హిట్ అయిన బిగ్ బాస్ కార్యక్రమం తెలుగు బుల్లితెరపై కూడా అరంగేట్రం చేసింది.  ఈ క్రమంలోనే బిగ్ బాస్ ను తెలుగు ప్రేక్షకులందరూ బాగా ఆదరించారు. దీంతో గత ఐదు సీజన్స్ ఎంతో విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పటికి ఐదు సీజన్లు పూర్తి  కాగా మరికొన్ని రోజుల్లో ఆరో సీజన్ కూడా ప్రారంభం కాబోతుంది అనే విషయం తెలిసిందే. బిగ్బాస్ సీజన్ కు సంబంధించి ఒక ప్రోమో విడుదల అయింది.


 గత మూడు ప్రోమోల నుంచి బిగ్బాస్ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తున్న టాలీవుడ్ కింగ్ నాగార్జున ఆరో సీజన్ కు కూడా వ్యాఖ్యాతగా  వ్యవహరించి పోతున్నాడు అని తెలుస్తోంది. ఇకపోతే ఇక మరికొన్ని రోజుల్లో బిగ్బాస్ ఆరవ సీజన్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమంలోకి వెళ్లబోయే కంటెస్టెంట్స్ ఎవరు అన్నదానిపై కొన్ని పేర్లు వైరల్ గా మారిపోతున్నాయి. అదే సమయంలో రోజుకు ఒక కొత్త పేరు తెరమీదికి వస్తూ ఉంది అని చెప్పాలి. ఇక ఫోక్ సింగర్ గా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న మోహన భోగరాజు బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ లోకి వెళ్లబోతుందట.


 మోహన భోగరాజు ఎవరో మీకందరికీ తెలిసే ఉంటుంది. అదే నండి అందరినీ ఉర్రూతలూగించిన బుల్లెట్ బండి సాంగ్ పాడిన సింగర్. బుల్లెట్ బండి పాట సృష్టించిన సెన్సేషన్  గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక్క పాటతో మోహన భోగరాజు సెలబ్రిటీ గా మారిపోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే త్వరలోనే ప్రారంభం కాబోతున్న బిగ్బాస్ కార్యక్రమంలో మోహన్ నాగరాజు పాల్గొన పోతుంది అని తెలుస్తోంది.. వీరితోపాటు జబర్దస్త్ కమెడియన్ చలాకి చంటి,సీరియల్ యాక్టర్ అర్జున్ కళ్యాణ్, యూట్యూబర్ శ్రీకాంత్, యాంకర్ దీపిక పిల్లి మరో యూట్యూబర్ ఆదిరెడ్డి కూడా బిగ్ బాస్ హౌస్ లోకి  వెళ్ళిపోతున్నారూ అని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: