హాట్ బ్యూటీ సమంత ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు చేస్తూ యావత్ ప్రపంచాన్ని ఊర్రూతలూగిస్తుంది.రీసెంట్ గానే భర్త నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన ఈ హాట్ బ్యూటీ ప్రజెంట్ వరుస సినిమాలతో దూసుకుపోతుంది. అయితే గత కొంతకాలంగా సమంత పలు ఇంటర్వ్యూలో అయితే నాగచైతన్యను పరోక్షంగా టార్గెట్ చేస్తుంది.ఇంకా ఇప్పటికే కాఫీ విత్ కరణ్ షోలో సమంత చేసిన వ్యాఖ్యలు కూడా పెద్ద దుమారాన్నే రేపాయి. ఇక ఈ ఒక్క డైలాగ్ తో చెప్పొచ్చు వాళ్ళ మధ్య ఎంత పెద్ద గొడవ జరిగిందో అని. అయితే మాజీ భర్త నాగచైతన్య మాత్రం సమంత పై పాజిటివ్ గానే స్పందిస్తున్నారు. సమంతతో కలిసి నటించాల్సివస్తే ఖచ్చితంగా నటిస్తానని కూడా ఆయన ఓ ఇంటర్వ్యులో చెప్పారు.అయితే ప్రస్తుత్తం సమంత వాళ్ళ అమ్మతో కలిసి నాగచైతన్యతో గడిపిన ఆ ఇంట్లోనే ఉంటుంది. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సమంతకు వాళ్ళ అమ్మకు పెద్ద గొడవ జరిగినట్లు సోషల్ మీడియాలో అనేక వార్తలు వైరల్ అవుతున్నాయి. భర్త నాగచైతన్య నుండి విడిపోయిన తర్వాత సమంత ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చాయట.


చెడు స్నేహాలు,చెడు అలవాట్లు,ఎక్కువగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్న క్రమంలోనే సమంత ఓ పాడు చేస్తూ వాళ్ళ అమ్మకు అడ్డంగా దొరికిపోయిందట. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా స్టార్ స్టేటస్ సంపాదించుకున్న సమంత నాగచైతన్య నుండి విడిపోయిన తర్వాత ఎక్కువ కోపానికి గురవుతుందట. చిన్న విషయానికి కూడా బాగా కోపడిపోతుందట.ఇక రీసెంట్ గా .. అర్థరాత్రి ఇంటికి ఓ స్నేహితుడి తో వచ్చిన సమంత పై వాళ్ళ అమ్మ గట్టిగా అరిచినట్లు సోషల్ మీడియాలో అనేక వార్తలు వస్తున్నాయి. పేరుకు ఫ్రెండే అని చెప్తున్నా అతని ప్రవర్తన అనేది అస్సలు బాగా లేకపోవడంతో సమంతను ఆమె అమ్మ మందలిచ్చిందట . దీంతో సమంత కోపానికి గురై వాళ్ళ అమ్మను ఇంట్లో నుంచి పొమ్మని కూడా గట్టిగా అరిచిందట. దీంతో సమంత తల్లికు కోపం వచ్చి సమంతను ఇక లాగిపెట్టి కొట్టి..ఆ అబ్బాయిను బయటకు పంపించేసిందంటూ సోషల్ మీడియాలో ఓ వార్త ఇప్పుడు తెగ వైరల్ గా మారింది. మొత్తానికి సమంత విడాకుల తరువాత బాగా డిప్రెషన్ లోకి వెళ్లింది అంటున్నారు ఆమెను అభిమానించే కొంతమంది జనాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: