మంచి టాలెంట్ ఉన్న నటులలో ఒకరు అయినా దుల్కర్ సల్మాన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దుల్కర్ సల్మాన్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన మహానటి మూవీ తో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. మహానటి మూవీ లో దుల్కర్ సల్మాన్ తన నటనతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు.

ఇది ఇలా ఉంటే తాజాగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సీతా రామం అనే తెలుగు మూవీ లో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించాడు. ఆగస్ట్ 5 వ తేదీన విడుదల అయిన సీతా రామం మూవీ ఇప్పటికే అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే ఈ మూవీ లో దుల్కర్ సల్మాన్ నటన కు కూడా అద్భుతమైన ప్రశంసలు దక్కుతున్నాయి.  దుల్కర్ సల్మాన్ కెరీర్ లోనే సీతా రామం మూవీ మంచి విజయంగా నిలిచింది.

ఇది ఇలా ఉంటే సీతా రామం మూవీ లో దుల్కర్ సల్మాన్ కంటే ముందుగా మూవీ యూనిట్ ఇద్దరు హీరోలను అనుకుందట, కానీ ఆ ఇద్దరు హీరోలు సీతా రామం మూవీ ని రిజెక్ట్ చేయడంతో చివరగా ఈ మూవీ లో దుల్కర్ సల్మాన్ కి అవకాశం వచ్చిందట. ఆ ఇద్దరు హీరోలు మరెవరో కాదు ...  ముందుగా సీతా రామం సినిమా కోసం  నాని ని మూవీ యూనిట్ సంప్రదించారట, కాకపోతే వరస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండడం వల్ల ఈ మూవీ చేయలేకపోయాడట. ఆ తర్వాత ఈ కథ రామ్ వద్దకు వెళ్లిందట, అయితే రామ్మూవీ పై అంతగా ఆసక్తి చూపించలదట. దానితో చివరగా దుల్కర్ సల్మాన్ వద్దకు ఈ కథ వెళ్లిందట.  సీతా రామం  కథ దుల్కర్ సల్మాన్ కు బాగా నచ్చడంతో వెంటనే ఈ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: