టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లో హీరోగా , నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కళ్యాణ్ రామ్ కొంత కాలం క్రితం ఎంత మంచి వాడవురా అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. ఎంత మంచి వాడవురా మూవీ తో ప్రేక్షకులను కాస్త నిరుత్సాహపరిచిన కళ్యాణ్ రామ్ తాజాగా బింబిసార అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. మంచి అంచనాల నడుమ ఆగస్ట్ 5 వ తేదీన బింబిసార మూవీ థియేటర్ లలో విడుదల అయ్యింది. ప్రేక్షకుల అంచనాలకు తగినట్లు గానే ఈ మూవీ అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ కి బాక్సా ఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు దక్కుతున్నాయి.

ఇప్పటి వరకు 13 రోజుల బాక్సా పీస్ రన్ ని కంప్లీట్ చేసుకున్న బింబిసార మూవీ ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలు తెలుసుకుందాం. నైజాం : 10.17 కోట్లు ,  సీడెడ్ : 6.73 కోట్లు ,  యూ ఏ : 4.41 కోట్లు , ఈస్ట్ : 1.75 కోట్లు , వెస్ట్ : 1.31 కోట్లు , గుంటూర్ : 2.02 కోట్లు ,  కృష్ణ : 1.47 కోట్లు , నెల్లూర్ : 85 లక్షలు . రెండు తెలుగు రాష్ట్రాల్లో 13 రోజుల్లో బింబిసార మూవీ 28.71 కోట్ల షేర్ , 45.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో : 2.04 కోట్లు . ఓవర్ సీస్ లో :  2.18 కోట్లు . 13 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా బింబిసార మూవీ 32.93 కోట్ల షేర్ , 54.45 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: