నందమూరి హీరో కల్యాణ్ రామ్ హీరోగా స్వీయ నిర్మానంలో తెరకెక్కిన సినిమా బింబిసార. యంగ్ డైరెక్టర్ కొత్త డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వం వహించిన ఈ సినిమా, విడుదలైన రోజునే సూపర్ సక్సెస్ అందుకోని హిట్ టాక్ తెచ్చుకుంది.హీరో కల్యాణ్ రామ్ కెరియర్లోనే అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా నిలిచింది. మూడు డిఫరెంట్ లుక్స్ తో కల్యాణ్ రామ్ కనిపించిన ఈ మూవీలో హీరోయిన్లు గా సంయుక్తా మీనన్ తో పాటు ఇంకా కేథరిన్ థెరిస్సాల కలిసి నటించి మెప్పించారు.మొదటి నుంచి కూడా ఈ సినిమాపై పక్కా కాన్ఫీడెంట్ గానే ఉన్నాడు కల్యాణ్ రామ్. అంతే కాదు ఎన్టీఆర్ కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ సినిమా సక్సెస్ పై ఎంతో నమ్మకం వ్యక్తం చేశాడు. ఈ సినిమా చూసిన స్టార్ సెలబ్రిటీలంతా కూడా మంత్రముగ్థులు అవుతున్నారు. ఇక రీసెంట్ గా నట సింహం బాలయ్య కోసం ఈ సినిమా ప్రత్యేక పదర్శన వేయగా.. నందమూరి కుటుంబంతో కలిసి సినిమా చూసి బాలయ్య సంతోషం వ్యాక్తం చేశారు.అంతకు ముందు తమిళ స్టార్ హీరో అయిన విజయ్ కూడా.. హైదరాబాద్ లో తన సినిమా షూటింగ్ నిమిత్తం వచ్చి.. షెడ్యూల్ గ్యాప్ లో మహేష్ బాబుకు సంబంధించిన ఏఏమ్బీమాల్ లో సీక్రేట్ గా ఈ సినిమా చూసి వచ్చారు.


ఇక ఈమూవీ విషయంలో దిల్ ఖుష్ గా ఉన్న కల్యాణ్ రామ్.. ఇప్పుడు అసలైన మరో అడుగు ముందుకు వేయబోతున్నాడు.అయితే ఇప్పటి వరకూ కూడా బింబిసార సినిమాను తెలుగులో మాత్రమే విడుదల చేశారు.ఇక తెలుగులో వచ్చే రెస్పాన్స్ ను బట్టి ప్లాన్ బీని రెడీ చేసుకోవాలి అనున్నారు టీమ్. ఈ విషయాన్ని ప్రమోషన్స్ సమయంలో స్వయంగా కల్యాణ్ రామ్ చెప్పాడు. సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తే.. మిగతా భాషల్లో కూడా రిలీజ్ చేస్తామన్నారు ఆయన. ఇక అనుకున్నట్టుగానే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి భారీ లాభాలను సొంతం చేసుకుంది.ఇక అనుకున్నట్టుగానే కల్యాణ్ రామ్ ఇతర భాషల్లో కూడా ఈ సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయిన నిఖిల్ కార్తికేయ2 సినిమా హిందీలో భారీ వసూళ్లను రాబడుతూ ఉండటంతో  ఇక బింబిసార సినిమాను కూడా  హిందీలో రిలీజ్ చేసే ఆలోచనలో ఆయన ఉన్నాడని అంటున్నారు.అందుకు సంబంధించిన సన్నాహాలు కూడా జరుగుతున్నట్టు  సమాచారం తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: