టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం  బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా నాగచైతన్య  బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది నాగచైతన్య నే అని చెప్పవచ్చు.ఇటీవల నాగచైతన్య నటించిన థాంక్యూ సినిమా అలాగే బాలీవుడ్ మూవీ లాల్ సింగ్ చద్దా సినిమా కూడా ఊహించిన విధంగా రెండు డిజాస్టర్ లుగా నిలిచిన విషయం తెలిసిందే.అయితే  ఆగస్టు 11న విడుదల అయినా లాల్ సింగ్ చద్దా సినిమాకు బాలీవుడ్ బాయ్ కాట్ ట్రెండ్ పెద్ద అడ్డంగా మారింది అని చెప్పవచ్చు. ఇక తెలుగులో విడుదల అయిన థాంక్యూ సినిమాలో సరైన కంటెంట్ లేకపోవడంతో ఈ సినిమా అలరించలేకపోయింది.

ఇక  ఈ సినిమాకు లేనివిధంగా ఒక టికెట్ కొంటే మరొక టికెట్ ఫ్రీ అంటూ థియేటర్ల వద్ద ప్రచారం చేసినా కూడా ఈ సినిమాకు ఆశించిన విధంగా ప్రేక్షకాదరన దక్కకపోగా ప్రేక్షకులు థియేటర్ కు కూడా రావడం లేదు. ఇక దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.అయితే  ఇది ఇలా ఉంటే ఇటీవల ఒక బాలీవుడ్ మీడియాతో ముచ్చటించినా నాగచైతన్య పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.ఇకపోతే  ప్రస్తుతం కంటెంట్ ఉన్న సినిమాలు మాత్రమే థియేటర్లో ఆడుతున్న నేపథ్యంలో రీమిక్స్ సినిమాలు ఆకట్టుకునే ప్రసక్తే లేదు అని తెలిపాడు నాగచైతన్య. అంతేకాదు అలాగే బాలీవుడ్ లో మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నట్లు తెలిపారు.

అయితే అవకాశాల కోసం చూస్తున్నానని అక్కడ చాలా మంది మేకర్స్ వున్నారని వారితో కలిసి పని చేయాలనుకుంటున్నట్లు స్పష్టం చేశాడు చైతూ. ఇక బాలీవుడ్ తో పాటు నాకు ఆసక్తిని కలిగించే కథ ఏ భాషలో లభించినా కూడా అందులో నటించడానికి నేను రెడీ అని చెప్పుకొచ్చాడు నాగచైతన్య.  ఇక ముందు ముందు ప్రయోగాత్మక పాత్రల్లో నటించాలని అనుకుంటున్నట్లుగా తెలిపాడు. అయితే మూవీ మేకర్స్ తమ సినిమాలని ప్రేక్షకులకు చేరువ చేయడానికి ప్రయత్నించడం కంటే వారికి ఇష్టమైన కంటెంట్ తో సినిమాలు చేస్తే బాగుంటుందని తెలిపారు. ఇక అన్నిరకాల సంస్కృతులు ఎమోషన్స్ మనకున్నాయని వాటిని ప్రతిబింబించే సినిమాలు ఆదరించడానికి ప్రేక్షకులు ఎప్పుడూ సిద్ధంగా వున్నారని తెలిపాడు.  చైతన్య మాటలను విన్న కొందరు రెండు సినిమాల ఫ్లాప్ తో చై లో ఎంత మార్పు అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: