మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ మలయాళం లో మంచి విజయం సాధించిన లూసిఫర్ మూవీ కి రీమేక్ గా తెరకెక్కుతోంది. ఈ మూవీ ని అక్టోబర్ 5 వ తేదీన తెలుగు మరియు హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా ఆ ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తుంది.

ఇది ఇలా ఉంటే సెప్టెంబర్ 25 వ తేదీన ఈ మూవీ ట్రైలర్ ని కూడా మూవీ యూనిట్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల వరకు ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు గాడ్ ఫాదర్ మూవీ యూనిట్ పెద్దగా ఈ మూవీ కి ప్రమోషన్ లను కూడా చేయలేదు.

అయినప్పటికీ ఈ రేంజ్ లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ అంటే మెగాస్టార్ చిరంజీవి స్టార్ ఇమేజే ఈ రేంజ్ బిజినెస్ కి కారణం అంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ మూవీ లో సల్మాన్ ఖాన్ , సత్యదేవ్ ,  నయన తార ముఖ్య పాత్రాలలో నటించగా , ఎస్ ఎస్ తమన్మూవీ కి సంగీతాన్ని అందించాడు. ఈ మూవీ పై మెగా అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ మూవీ బాక్సా ఫీస్ దగ్గర ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: