దసరా పండుగ వచ్చింది అంటే బాక్స్ ఆఫీస్ దగ్గర అనేక మూవీ లు విడుదల అవుతూ ఉండటం మనం చూస్తూనే ఉంటాం. ఈ సంవత్సరం కూడా దసరా పండగ కు అలాంటి వాతావరణమే కనపడే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం దసరా సెలవులను క్యాష్ చేసుకోవడానికి కొన్ని సినిమాలు ఇప్పటికే తమ మూవీ ల విడుదల తేదీలను ప్రకటించిన రెడీగా ఉన్నాయి. అలా ఈ సంవత్సరం దసరా పండుగ కు విడుదల కాబోయే సినిమాల వివరాలను తెలుసుకుందాం.

ధనుష్ హీరోగా తేరకెక్కిన నేనే వస్తున్నా మూవీ ని సెప్టెంబర్ 29 వ తేదీన తమిళ్ మరియు తెలుగు భాషలో  విడుదల కాబోతోంది. ఈ మూవీ ని తెలుగు లో గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ విడుదల చేయనున్నారు. మణిరత్నం దర్శకత్వంలో చియాన్ విక్రమ్ , కార్తీ , జయం రవి ,  ఐశ్వర్య రాయ్ త్రిష ప్రధాన పాత్రలలో తేరకెక్కిన పొన్నియన్ సెల్వన్ మొదటి భాగం సెప్టెంబర్ 30 వ తేదీన తమిళ ,  తెలుగు , కన్నడ , మలయాళ , హిందీ భాషల్లో విడుదల కాబోతోంది.

మూవీ ని తెలుగు లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేయనున్నాడు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన గాడ్ ఫాదర్ మూవీ ని అక్టోబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్నాయి.  నాగార్జున హీరోగా సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో తెరకెక్కిన ది ఘోస్ట్ మూవీ ని అక్టోబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్నాయి. స్వాతి ముత్యం మూవీ ని అక్టోబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: