తెలుగు సినిమా ఇండస్ట్రీ లో నటుడి గా , నిర్మాత గా తన కంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ను ఏర్పరచుకున్న కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే కళ్యాణ్ రామ్ ఎన్నో విజయవంత మైన మూవీ లలో నటించి , విజయ వంతమైన మూవీ లను నిర్మించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ని సంపాదించు కున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా కళ్యాణ్ రామ్ , మల్లాడి వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కిన బింబిసార అనే మూవీ లో హీరోగా నటించాడు.

మూవీ లో క్యాథరిన్ , సంయుక్త మీనన్ హీరోయిన్ లుగా నటించారు. ఈ మూవీ విడుదలకు ముందు బింబిసార మూవీ యూనిట్ ఈ సినిమా నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ బింబిసార మూవీ ఆగస్టు 5 వ తేదీన థియేటర్ లలో విడుదల అయ్యి ,  భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర సొంతం చేసుకుంది.

అలాగే ఈ మూవీ కి కలెక్షన్ లు కూడా అదిరి పోయే రేంజ్ లో దక్కాయి. ఇది ఇలా ఉంటే బాక్సా ఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని సాధించిన ఈ సినిమా మరి కొన్ని రోజుల్లోనే 'ఓ టి టి' ఫ్లాట్ ఫేమ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది? ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం బింబిసారా మూవీ సెప్టెంబర్ 23 వ తేదీన లేదా సెప్టెంబర్ 30 వ తేదీన ప్రముఖ 'ఓ టి టి' సంస్థలలో ఒకటి అయినటు వంటి జీ 5 'ఓ టి టి' ఫ్లాట్ ఫేమ్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: