కొన్ని సినిమాలకు ఏమాత్రం బజ్ క్రియేట్ అవదు. కారణమేంటో ఎవరికి తెలియదు కానీ సదరు సినిమా లో పెద్ద పెద్ద వారు నటించినా కూడా వారి సినిమాలకు ప్రేక్షకులలో ఏమాత్రం క్రియేట్ అవదు. మెగాస్టార్ చిరంజీవి లాంటి భారీ హీరోల సినిమాలకే ఇప్పుడు చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఆ చిత్రానికి బజ్ లేకపోవడం లేదు అని వార్తలు సోషల్ మీడియాలో ఎక్కువ అవడంతో మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఆ చిత్రం యొక్క ప్రమోషన్ కార్యక్రమాలను మొదలు పెట్టడానికి సిద్ధమవుతున్నారు.

తాజాగా మరొక సినిమాకు ఇప్పుడు ఇదే విధమైన పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పవచ్చు. సమంత ప్రధాన పాత్రలో చేస్తున్న ఓ సైన్స్ ఫిక్షన్ సినిమా యశోద చిత్రానికి ఏమాత్రం బజ్ లేదనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇది ఈ సినిమాకు నెగిటివ్ అవుతుందనే ఆలోచన చిత్ర బృందంలో రోజురోజుకు ఎక్కువ అవుతుంది. ప్రస్తుతం సమంత ఊళ్లో లేకపోవడం ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ చేయడానికి ఆమె అందుబాటులో లేకపోవడం వంటివి జరగడంతో చిత్ర బృందం కూడా ఏం చేయాలో అన్న అర్థం కాని పరిస్థితులలో ఉంది. 

విడాకుల తర్వాత సినిమా పరిశ్రమలో నిలదొక్కుకోవాలని చెప్పి సమంత వరుస చిత్రాలను అంగీకరించి పూర్వ వైభవాన్ని తెచ్చుకునే విధంగా గట్టి ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలోనే రెండు లేడీ ఓరియంటెడ్ సినిమాలను ఓకే చేసిన సమంత ఒక చిత్రాన్ని విడుదలకు సిద్ధం చేయగా ఇప్పుడు ఈ రెండవ సినిమా అయినా యశోద చిత్రాన్ని కూడా విడుదల వరకు తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో ఈ రెండు సినిమాలు విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో ఆ చిత్రాలకు సంబంధించి ప్రమోషన్స్ వీక్ గా ఉన్నాయని వార్తలు వస్తున్నాయి అని లేకపోవడమే ఈ విధమైన వార్తలు రావడానికి కారణం అని తెలుస్తుంది. మరి  ఈ సినిమాలపై ఉన్న నెగెటివిటీని పోగొట్టుకోవడానికి ఆ చిత్ర బృందాలు ఏం చేస్తాయో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: