టాలీవుడ్ సినిమా పరిశ్రమ లో మంచి క్రేజ్ కలిగిన హీరో విజయ్ దేవరకొండ. ఆయనకు అతి తక్కువ కాలంలో స్టార్ హీరో ఇమేజ్ వచ్చిందని చెప్పాలి. కెరీర్ ఆరంభంలో గొప్ప విజయాలు రావడం ఆయనకు ఇంతటి క్రేజ్ రావడానికి కారణం. ఏదైతేనేం అయన హార్డ్ వర్క్ కి మంచి పోసిషన్ వచ్చిందనే చెప్పాలి. ఆ విధంగా ఇటీవలే అయన లైగర్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అంతకుముందు ‘డియ‌ర్ కామ్రేడ్’ ‘వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ లవర్’ వంటి సినిమాలతో ప్రేక్షకులను నిరాశపరిచిన ఈ హీరో ఆ త‌ర్వాత ‘లైగ‌ర్’ సినిమా తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. అయితే ఎన్నో ఆశలు పెట్టుకుని చేసిన ఈ సినిమా ప్రేక్షకులు ఆశించినంత విజయాన్ని అందుకోలేదు.

 అభిమానులను భారీ స్థాయి లో నిరాశపరిచింది. వాస్తవానికి విడుద‌ల‌కు ముందే ఈ చిత్రంపై విప‌రీత‌మైన బ‌జ్ ఏర్ప‌డింది. ప్రమోషన్ కార్యక్రమాలను కూడా భారీగా చేసిన ఈ సినిమా పై దేశవ్యాప్తంగా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అలా భారీ అంచ‌నాల న‌డుమ ఆగ‌స్టు 25న విడుద‌లైన ఈ చిత్రం మొద‌టి షో నుండి ఫ్లాప్ టాక్‌ను తెచ్చుకుంది. కథ బాగోలేకపోవడం, దర్శకత్వం లో లోపం వల్ల ఈ సినిమా ఇలా అయిపొయింది. పూరీ జగన్నాధ్ సినిమా ను బాగా డ్రైవ్ చేయలేకపోయాడు అని చెప్పాలి. ఏదేమైనా ఓపెనింగ్స్ భారీ రేంజ్‌లో వ‌చ్చిన రెండో రోజు నుండి ఫుల్ డ్రాప్స్ ప‌డ్డాయి.

దానికి తోడు నెగెటివిటీ కూడా బాగా ఉండడంతో ఈ సినిమా ఆ దాడిని తట్టుకోలేకపోయింది. ఫైనల్ గా ఈ సినిమా యొక్క ఫ‌లితం అభిమానులను మాత్రమే కాదు మేక‌ర్స్‌ను తీవ్రంగా నిరాశ‌ప‌రిచింది. అయితే చాలామంది ఈ సినిమా యొక్క ఓటీటీ కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా హాట్ స్టార్ లో ఈ సినిమాను ఈనెల 22 న విడుదల చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ సోషల్ మీడియా లో వినిపిస్తున్న వార్తల ప్రకారం త్వరలోనే ఈ సినిమా కి సంబందించిన అధికారిక ప్రకటన రాబోతుంది. మరి థియేటర్ లలో ఈ సినిమా కి మంచి పేరు రాని నేపథ్యంలో ఇక్కడైనా మంచి టాక్ అందుకుంటుందా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: