చిన్నప్పటినుంచి ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేసిన ప్రముఖ నటి గుమ్మడి జయవాణి.. చదువుకునే సమయంలోనే పెళ్లి చేసుకుని ఆ తర్వాత ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.
సినిమాల్లోకి రావడానికి జయవాణి ఫ్యామిలీ అంగీకరించకపోయినా పెళ్లి తర్వాత భర్త సహాయంతో ఇండస్ట్రీలోకి వచ్చింది. మొదటగా సీరియల్స్ లో చిన్న చిన్న క్యారెక్టర్స్ లో నటించి ఆ తర్వాత సినిమాలలో కూడా అవకాశాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా వ్యాంప్ పాత్రలకు పెట్టింది పేరుగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక విక్రమార్కుడు, యమదొంగ , మహాత్మా, గుంటూరు టాకీస్ లాంటి సినిమాలు చేసి తన మసాలా సన్నివేశాలతో ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జయవాణి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
జయవాణి మాట్లాడుతూ.. అదిరిందయ్యా చంద్రం సినిమాలో వేణుమాధవ్ రోడ్డుపై తాగి పడిపోతే.. అతన్ని లేపి ఇంటికి తీసుకెళ్లే సీన్ చేస్తున్నాము.. ఇక డైరెక్టర్ వచ్చి అంత అలా ఇలా అని చెప్పి.. రిహార్సల్స్ చేయించారు. అయితే రిహార్సల్స్ లో డైలాగులు మాత్రమే ఉన్నాయి. తీరా యాక్షన్ అనగానే క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయి.. వేణుమాధవ్ ని కాలితో తన్నుకుంటూ ఈడ్చుకెళ్ళాను.. ఇక ఆ సీన్ టేక్ ఓకే అయిపోయింది. కానీ డైరెక్టర్ టెన్షన్ పడుతూ.. అలా తన్నేసావ్ ఏంటి ? సీన్లో అది లేదు కదా! వేణుమాధవ్ మధ్యలో వెళ్ళిపోతే ఏంటి నా పరిస్థితి అని డైరెక్టర్ అంటుండగానే.. అప్పుడే వేణుమాధవ్ వచ్చి సీన్ చాలా బాగా చేశావని మెచ్చుకున్నారు .అప్పుడు నేను హమ్మయ్య అనుకున్నాను.. అంటూ చెప్పుకొచ్చింది.

ఇక అంతే కాదు తాను ఏదైనా ఒక క్యారెక్టర్ లోకి దిగాక. ఏం జరిగినా కూడా పట్టించుకోకుండా.. క్యారెక్టర్ లో చెలరేగిపోతాను అని , క్యారెక్టర్ పండడానికి ఎంతైనా సాహసిస్తాను అంటూ ఈ ఉదాహరణ చెప్పుకొచ్చింది జయవాణి.. ఇక ప్రస్తుతం జయ వాణి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఏది ఏమైనా ఈమె కొన్ని సినిమాలలో విలన్ పాత్రలో కూడా నటించి ప్రేక్షకులను బాగా అలరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: