తెలుగు టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ 6 ఇటీవల మొదలైన విషయం తెలిసిందే.. అప్పుడే మూడో వారంకు చేరుకుంది. మొదటివారం ఎలిమినేషన్ ఎత్తేసిన బిగ్‌బాస్‌ రెండోవారం ఇద్దర్ని హౌస్ నుంచి బయటకి పంపిచేస్తూ షాక్ ఇచ్చాడు. హౌస్ నుంచి షాని, అభినయ శ్రీ ఎలిమినేట్ చేస్తూనే కంటెస్టెంట్స్ అందరికి.. సరిగ్గా ఆడట్లేదు అని గట్టిగా క్లాస్ పీకాడు నాగార్జున. దీంతో మూడోవారం నామినేషన్స్ ని గొడవల తో రచ్చ రచ్చ చేశారు.. నువ్వా, నేనా అంటూ ఒకరికి మరొకరు అన్న విధంగా ఆటను ఆడారు..


ఈ వారం నామినేషన్స్ లో అత్యధిక ఓట్లు పడడంతో రేవంత్‌, బాలాదిత్య, గీతూ, ఆరోహి, చంటి, వాసంతి, నేహా, శ్రీహాన్‌ మూడో వారం ఎలిమినేషన్‌ లో ఉన్నారు. ఇక బిగ్‌బాస్‌ నిర్వాహకులు నేటి ప్రోమోని విడుదల చేశారు. “ఈ వారం కెప్టెన్సీ పోటీదారుడికి ఇస్తున్న టాస్క్ అడవిలో ఆట” అంటూ మొదలైన ప్రోమో మంచి హీట్ పుట్టించేలా నడించింది..నేహా ఒకటే తన బాధలను చెప్పుకుంటు భాధ పడుతుంది.


ఈ టాస్క్ లో కొందరు పోలిసులగా, మరికొందరు దొంగలుగా, గీతూ రాయల్ అత్యాశ ఉన్న వ్యాపారస్తురాలి గా వ్యవహరిస్తున్నారు. టాస్క్ లో భాగంగా దొంగ పోలీసులు మధ్య గొడవ కాస్త హౌస్ మేట్స్ మధ్య గొడవగా మారి ఇనాయ, రేవంత్ అండ్ శ్రీహాన్ మధ్య పెద్ద గొడవే జరిగినట్టు ప్రోమోలో తెలుస్తుంది. మరి మూడోవారం కెప్టెన్ గా ఎవరు నిలవబోతున్నారో తెలియాలంటే ఇవాళ్టి ఎపిసోడ్ చూడాల్సిందే.. మొత్తానికి ఈ షో కూడా రుమెర్స్ కు కెరాఫ్ గా నిలిచింది. ఈ సీజన్ లో దాదాపు అందరూ యంగ్.. యూత్ కు ఈ సీజన్ బాగా సందడి చేయనుంది... మరి చివరికి విన్నర్, రన్నర్ ఎవ్వరూ అనే విషయం తెలియాలంటే సీజన్ అయ్యే వరకూ ఆగాల్సిందే..


మరింత సమాచారం తెలుసుకోండి: