ఒకప్పటి హీరోయిన్, సహాయ నటి అయిన జయకుమారి గత కొద్దిరోజులుగా ఈమె పేరు బాగా వినిపిస్తోంది. ఈమె ఎంతో మంది ప్రేక్షకులను అలరించిన పెద్దగా తెలిసుండకపోవచ్చు. ఈమె మొదట బాలమిత్రుల కథ, మానవుడు దానవుడు, సంపూర్ణ రామాయణం, ఇంటి గౌరవం, తదితర సినిమాలలో నటించింది ఈమె ఎన్టీఆర్, ఎంజీఆర్, దిలీప్ కుమార్, రాజ్ కుమార్ వంటి స్టార్ హీరోల చిత్రాలలో కూడా ఈమె నటించింది. హీరోయిన్ జయకుమారి కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం వంటి భాషలలో 400కు పైగా సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. అంతేకాకుండా పలు చిత్రాలలో కూడా స్పెషల్ సాంగులలో నటించింది.


అయితే ఈనటి  కర్ణాటక ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడంతో తమిళంలోనే ఎక్కువ చిత్రాలు చేసింది. ఇదంతా ఇలా ఉండదు గత కొద్దిరోజులుగా ఈ మే ఆనారోగ్య సమస్యతో చాలా ఇబ్బంది పడుతూ ఉండడంతో చెన్నైలోనే ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు వినిపించాయి. ఈ వార్తలు కొద్ది రోజులలోనే చాలా వైరల్ గా మారాయి.. ఈమె ఆర్థిక ఇబ్బందులలో కూరకుపోవడం వల్లే.. ఈమెను ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించినట్లు సమాచారం. ఇక ఈమె పరిస్థితి కూడా చాలా దయనీయంగా ఉండడంతో ఇండస్ట్రీ వర్గాలలో ఈ విషయం చాలా చర్చనీ అంశంగా మారిందట.కనీసం వైద్యానికి కూడా డబ్బులు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉండడంతో... ఆమె ఆరోగ్యం పాడైందని తన ఇంటి పక్కన ఉండే సన్నిహితులు తెలియజేసినట్లు సమాచారం. అలాగే ఈమెకు సహాయం చేసేందుకు ఎవరైనా ముందుకు వస్తే బాగుంటుందని కూడా వార్త వినిపించాయి. దీంతో అక్కడి ప్రభుత్వం వెంటనే స్పందించి తమిళనాడు హెల్త్ మినిస్టర్ ఎం సుబ్రహ్మణ్యం ఈ విషయాన్ని పూర్తిగా తెలుసుకొని వెంటనే అక్కడికి వెళ్లి జయ కుమారిని పరామర్శించడం జరిగింది. ఇక జయ కుమార్ కి రెండు కిడ్నీలు కూడా పాడాయ్యాయి అలాగే ఆమెకు ఇల్లు కూడా లేకపోవడంతో కేవలం రూ.750 రూపాయల అద్దె ఇంటిలో ఉంటున్నట్లు సమాచారం. ఇక వైద్యులు నటి జయకుమారికి చికిత్స అందించాలని సూచించినట్లుగా కూడా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: