ఈ సినిమాలో కీలకమైన పాత్ర లో హీరో వెంకటేష్ కూడా నటిస్తున్నారు.ఈ విషయాన్ని తాజాగా తెలుపుతూ ఈ సినిమాకు సంబంధించి గ్లింప్స్ వీడియోను విడుదల చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ సినిమాని అక్టోబర్ 21వ తేదీన విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించడం జరిగింది. అయితే ఈ సినిమా ఎటువంటి హడావిడి లేకుండా పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారని చెప్పవచ్చు. దీంతో సినీ ప్రేక్షకులు సైతం ఆశ్చర్య పోవడం జరిగింది. ఇక అక్టోబర్ నెలలో పెద్దగా ఏ సినిమాలు విడుదల అవ్వడం తక్కువగా ఉండడం చేత ఈ సినిమాని అక్టోబర్ నెల లో విడుదల చేయబోతున్నట్లు సమాచారం.
ఈ చిత్రం లో హీరో వెంకటేష్ దేవుడు పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా లో ఒక కీలకమైన పాత్రలో విజయ్ సేతుపతి నటిస్తూ ఉన్నారు. వెంకటేష్ కూడా విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ దూసుకుపోతూ ఉన్నారు. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరిస్తుందేమో చూడాలి మరి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి.. గ్లింప్స్ వైరల్ గా మారుతున్నది. విశ్వక్ సెన్ సక్సెస్ అందుకుంటారేమో చూడాలి మరి.