పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు వరుస సినిమాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా పూర్తి చేయడానికి సన్నహాలు చేస్తున్నాడు. ఈ చిత్రానికి 50 రోజుల డేట్స్ కేటాయించడం విశేషం. ఆ విధంగా ఈ 50 రోజులలో పవన్ కళ్యాణ్ ఈ సినిమాను పూర్తి చేస్తాడా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఎప్పుడో పూర్తి కావలసి ఉండగా ఇతర సినిమాలు చేయడంతో పవన్ కళ్యాణ్ సినిమా చేయడానికి ఇంత సమయాన్ని తీసుకున్నాడు.

చాలాసార్లు ఈ సినిమా ఆగిపోయింది అని వార్తలు రావడంతో ఎట్టకేలకు ఈ సినిమాను నిర్మాత ఏ ఎం రత్నం మళ్లీ మొదలు పెట్టడం పవన్ కళ్యాణ్ అభిమానులను ఎంతగానో సంతోషపడుతుంది. చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా కాబట్టి ఈ చిత్రం పై ప్రతి ఒక్కరిలో కూడా ఎంతగానో ఆసక్తి కలిగి ఉంది. ఇప్పటికే పలు అప్డేట్లను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన చిత్ర బృందం వాటి ద్వారా సినిమాపై మంచి అంచనాలను ఏర్పాటు చేయగలిగింది. ప్రేక్షకులలో కూడా ఈ సినిమాపై ఇంతటి అంచనాలు ఏర్పడడానికి కారణం ఈ సినిమా చారిత్రాత్మక నేపథ్యంలో రూపొందించడమే.

వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ వచ్చే ఏడాది నుంచి ఎన్నికలు ప్రచారం చేయవలసిన నేపథ్యంలో ఇప్పుడు ఆయన ఒప్పుకున్న సినిమాలు చేయడానికి అతి తక్కువ సమయం ఉందనే చెప్పాలి. కొన్ని రోజులలోనే ఆయన ఇప్పటివరకు ఒప్పుకున్న సినిమాలను చేయవలసి ఉంటుంది. మరి చివరికి ఆ సినిమాలను ఆయన చేస్తాడా లేదా సమయం లేదని సాకుతో వాటిని పక్కన పెడతాడా అని చూడాలి. హరీష్ శంకర్ దర్శకత్వంలో, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అలాగే సముద్ర ఖని దర్శకత్వంలో అయన సినిమా చేయబోతున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: