ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా రాణించిన ముద్దుగుమ్మ త్రిష ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. బ్యాక్ టు బ్యాక్ స్టార్ హీరోలతో సినిమాలలో నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది. తెలుగుతో పాటు, తమిళ్ సినిమాలో కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ. అక్కడ కూడా తన సత్తా చాటిందని చెప్పవచ్చు.. ఆ తర్వాత పలు లేడీ ఓరియంటెడ్ సినిమాలలో కూడా నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఇప్పటికీ ఇంకా వివాహం ఉసు మాత్రం ఎత్తలేదు. ఇక త్రిష నటించిన 96 సినిమా పెను సంచలనాన్ని సృష్టించింది. ఈ చిత్రంలో త్రిష నటన ప్రతి ఒక్క ప్రేక్షకులను ఆకట్టుకునేలా చేసింది.


ఈ సినిమాకి ఎన్నో అవార్డులు కూడా తెచ్చి పెట్టిందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ మణిరత్నం డైరెక్షన్ లో వస్తున్న పోన్నియన్ సెల్వన్ సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కించడం జరుగుతోంది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా పాటలు టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాలో త్రిష కుందవైగా నటిస్తున్నది.పోన్నియన్ సెల్వన్ చిత్రంలో నటించిన అనుభవాలను సైతం పంచుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక త్రిష మాట్లాడుతూ ఈ చిత్రం పలు కమర్షియల్ అంశాలతో ఉండే హిస్టారికల్ సినిమా కావడంతో.. ఈ సినిమాలోని దుస్తులు, నడక హవభావాలు అన్ని మార్చుకోవాల్సి వచ్చింది అని తెలియజేసింది త్రిష.


ఈ సినిమాలో కుందవై పాత్ర కోసం తను ఆరు నెలలు ఇంట్లోనే పలు రిహార్సల్ కూడా చేస్తూ ఉన్నానని తెలియజేసింది అలాగే నటుడు జయం రవి సరసన రెండు సినిమాలలో నటించాను ps -1 చిత్రంలో ఆయనకు చెల్లెలుగా నటించానని అలాగే ఐశ్వర్య రాయ్ తో నటించడం తనకు మంచి అనుభవం అని కూడా తెలియజేసింది. ఈ సినిమాలో మా ఇద్దరి మధ్య పలు సన్నివేశాలు ఉన్నాయని కూడా తెలియజేసింది త్రిష. కుంద వై పాత్ర తనకు చాలా నేర్పించిందని.. ఇకపై తాను ఇలానే ఉండాలనుకుంటున్నానని త్రిష తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: