టాలీవుడ్ సినిమా పరిశ్రమలో కొంతమంది హీరోయిన్ లకు ఎంత ప్రయత్నించినా కూడా విజయాలు దక్కవు. వరుస అవకాశాలు వచ్చినప్పుడు వారికి విజయాలు పలకరించకపోవడంతో మెల్లమెల్లగా వారి క్రేజ్ తగ్గిపోతూ ఉంటుంది. అలాంటి వారిలో ఈ తరం కథానాయకలలో ఉండే హీరోయిన్ రాశీ కన్నా పరిశ్రమలోకి ఎప్పుడు ఇచ్చిన కూడా ఈ ముద్దుగుమ్మ అగ్ర హీరోయిన్ స్లాట్ లోకి వెళ్ళకపోవడం నిజంగా ఆమె అభిమానులను ఎంతగానో నిరాశ పరుస్తుంది అని చెప్పాలి.

 చేయడానికి పెద్ద హీరోలతో సినిమాలు చేసిన కూడా ఆమెకు ఆ సినిమాలు విజయాలు తెచ్చిపెట్టకపోవడంతో క్రేజ్ అనేది కొంతవరకే ఆగిపోయింది. దానికి తోడు అగ్ర హీరోలు ఆమెతో సినిమా చేయడానికి వెనకడుగు వేయడం కూడా ఆమె కెరియర్ ముందుకు వెళ్లక పోవడానికి కారణం అవుతుంది. ఇప్పుడు చేస్తున్న సినిమాలతోనైనా ఆమె మంచి విజయాలను అందుకొని అగ్ర హీరోయిన్ గా ఎదుగుతుందా అనేది చూడాలి. ఇప్పుడు ఇలాంటి బ్యాడ్ లక్ ఎదుర్కొంటుంది హీరోయిన్ కేతిక శర్మ ఈ ముద్దుగుమ్మ చేసిన మూడు సినిమాలు కూడా ప్రేక్షకులను ఏమాత్రం అలరించలేకపోయాయి.

తెలుగులో చేసిన మొదటి మూడు సినిమాలు ఈ విధంగా అయిపోవడం నిజంగా ఆమెను కలవర పరిచే విషయం అనే చెప్పాలి. ఇతర హీరోయిన్లు హిట్ సినిమాలను ఎంచుకొని ముందుకు పోతూ ఉంటే కేతిక శర్మ ఐరన్ లెగ్ అనే ముద్రను పడేసే సినిమాలు చేసుకోవడం నిజంగా ఆమె కెరీర్ ను ప్రమాదంలోకి నెట్టినట్లే అని చెప్పాలి. ఇటీవల ఆమె హీరోయిన్ గా నటించిన రంగ రంగా వైభవంగా సినిమా కూడా ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు ఆమె చేతిలో తెలుగు సినిమా ఏది లేదని చెప్పాలి త్వరలోనే ఆమెకు అవకాశం వస్తుందని చెప్తున్నారు . ఆ సినిమా అయినా ఆమెకు భారీ విజయాన్ని తెచ్చిపెట్టి ప్రేక్షకులను అలరించే ఫామ్ లోకి తీసుకువస్తుందా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: