టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న యువ హీరోలలో ఒకరు అయినటు వంటి నాగ శౌర్య తాజాగా కృష్ణ వ్రింద విహారి అనే మూవీ లో హీరోగా నటించాడు. షెర్లీ సెటియా, రాధిక, వెన్నెల కిశోర్ ఈ మూవీ లో కీలక పాత్రలలో నటించారు. అనీష్‌ ఆర్‌. కృష్ణమూవీ కి దర్శకత్వం వహించగా , మహతి స్వర సాగర్మూవీ కి సంగీతాన్ని అందించాడు. ఈ మూవీ ని రేపు అనగా సెప్టెంబర్ 2 3వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచారాలు చిత్రాలను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక ను భారీ ఎత్తున నిర్వహించింది.

సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలో భాగంగా ఈ మూవీ హీరో నాగ శౌర్య మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలని తెలియజేశాడు.  కృష్ణ వ్రింద విహారి మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలో భాగంగా నాగ శౌర్య మాట్లాడుతూ ... కృష్ణ వ్రింద విహారి మూవీ ప్రమోషన్ లలో భాగంగా చాలా మాట్లాడాను. మూవీ బాగుంటుంది చూడండి. పాదయాత్ర చేశాను. ఊర్లు తిరిగాను. ఈ మూవీ ట్రైలర్ నచ్చింది అని చాలామంది చెప్పారు. కంటెంట్ చేతిలో ఉంది కాబట్టి నలుగురిలో ధైర్యంగా వెళ్లి నిలబడ్డాను. నన్ను నమ్మండి ఈ మూవీ బాగుంటుంది. ఈ సినిమాని చూసి ఈ మూవీ హిట్టా ... సూపర్ ... హిట్ ఆ బ్లాక్ బాస్టర్ హ లేక ఫ్లాపా ఏదైనా నేను శిరస్సు వంచి తీసుకుంటాను.  కానీ నమ్మి ఈ మూవీ కి రండి మూవీ చాలా బాగా వచ్చిందని నేను జెన్యూన్ గా నమ్ముతున్నాను అంటూ నాగ శౌర్య చెప్పు కొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: