దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కది పెట్టుకోవాలి అనే సామెత సినిమా పరిశ్రమలో ప్రతి ఒక్కరు కూడా ఆచరిస్తూ ఉంటారు. వారికి ప్రేక్షకులలో మంచి డి మాండ్ అలాగే భారీ స్థాయిలో క్రేజ్ ఉన్నప్పుడే వారు సినిమాలను చేస్తూ దానికి తగ్గట్లుగా పారితోషకాలు అందుకుంటూ నాలుగు రాళ్లు వెనకేసుకుంటూ ఉంటారు. ప్రతి ఒ క్క టెక్నీషియన్ ప్రతి ఒక్క నటుడు కూడా ఈ విధంగా చేస్తూ జీవితంలో స్థిరపడుతూ ఉంటారు. ఆ విధంగా ఒకే ఒక సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఓ హీరోయిన్ ఇప్పు డు రెండవ సినిమా కోసం భారీ స్థాయి లో రెమ్యునరేషన్ డిమాండ్ చేయడం చిత్ర బృందం ఎంతో ఆశ్చర్యానికి గురిచేస్తుందట.

ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది మృణాల్ ఠాకూ ర్. అంతకుముందు ఆమె చేసిన సినిమాలను ప్రేక్షకులు ఏమాత్రం ఆదరించలేదు. దాంతో ఆమె ఎన్నో ఆశలు పెట్టుకుని చేసిన ఈ సీతారామం సినిమా భారీ విజయం సాధించడం ఆ సినిమా తో హీరోయిన్ గా ఇంతటి విజయం అందుకోవడం తో ఆమెకు ఇప్పుడు డిమాండ్ పెరిగిపోయింది. ప్రేక్షకులలో కూడా మంచి క్రేజీ ఏర్పడింది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా తర్వాత ఆమెకు భారీ స్థాయిలో అవకాశాలు వస్తాయని ముందుగా భావించినట్లుగానే ఆమెకు వరుస అవకాశాలు వస్తున్నాయట. ఈ నేపథ్యంలో ఆమె దగ్గరకు వచ్చే నిర్మాతకు ఆమె చెప్పే రేటు చూసి కళ్ళు బైర్లు కమ్ముతున్నాయట. ఏదేమైనా సినిమాలోని ఈ సామెత పాఠం తొందరగానే నేర్చుకున్న ఈ ముద్దుగుమ్మ సినిమా అవకాశాలు దక్కించుకోవాలి అంటే ఏమైనా రేట్లు తగ్గిస్తుందా అనేది చూడాలి. త్వరలోనే ఒక యువ హీరోతో కలిసి ఆమె సినిమా చేసే విధంగా రంగం సిద్ధం చేసుకుంటుందట. దానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారని తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: