తెలుగు సినిమా ఇండస్ట్రీ లో వైవిధ్యమైన కథా నాయకుడిగా పేరు తెచ్చు కున్న శ్రీ విష్ణు తాజాగా అల్లూరి అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో శ్రీ విష్ణు పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. ఈ మూవీ కి ప్రదీప్ వర్మ దర్శకత్వం వహించగా ,  ఈ మూవీ లో శ్రీ విష్ణు సరసన కయ్యదు లోహర్‌ హీరోయిన్ గా నటించింది. బెక్కెం వేణుగోపాల్‌ ఈ మూవీ ని నిర్మించాడు.  ఈ మూవీ ని రేపు అనగా సెప్టెంబర్ 23 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు.

మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో  ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ప్రమోషన్ లను అదిరి పోయే రేంజ్ లో చేస్తుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టు కునే విధంగా ఉండడంతో ఈ మూవీ పై సినీ ప్రేమికులు పర్వాలేదు అనే రేంజ్ లో అంచనాలను పెట్టు కున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి యు / ఏ సర్టిఫికెట్ లభించినట్లు సమాచారం. అలాగే ఈ మూవీని రన్ టైమ్ ని కూడా చిత్ర బృందం లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీ 2 గంటల 49 నిమిషాల భారీ నిడివి తో ప్రేక్షకులకు ముందుకు రానున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న అల్లూరి మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో తెలియాలి అంటే మరి కొంతకాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: