కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్న తలపతి విజయ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈ సంవత్సరం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం లో తెరకెక్కిన బీస్ట్ అనే పాన్ ఇండియా మూవీ తో ప్రేక్షకులను పలకరించిన తలపతి విజయ్ ప్రస్తుతం టాలీవుడ్ క్రేజీ దర్శకుడు అయినటు వంటి వంశీ పైడిపల్లి దర్శకత్వం లో తెరకెక్కుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. 

మూవీ తమిళ్ లో వరసు అనే పేరుతో విడుదల కానుండగా , తెలుగు లో వారసుడు అనే పేరుతో విడుదల కాబోతుంది. ఈ మూవీ షూటింగ్ పూర్తి కాగానే తలపతి విజయ్ కోలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరి పోయే క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటు వంటి లోకేష్ కనకరాజు దర్శకత్వం లో తెరకెక్కబోయే మూవీ లో హీరోగా నటించ బోతున్నాడు. ఈ మూవీ తలపతి విజయ్ కెరియర్ లో 67 వ మూవీ గా తెరకెక్కబోతుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే లోకేష్ కనకరాజు ఈ మూవీ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను ఫుల్ స్పీడ్ లో ముందుకు తీసుకు వెళుతున్నట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా ఇప్పటికే ఈ మూవీ లో తలపతి విజయ్ సరసన హీరోయిన్ గా త్రిష ని ఎంపిక చేసినట్లు  , అలాగే మరి కొన్ని ముఖ్య పాత్రలలో సంజయ్ దత్ ,  అర్జున్ సర్జ ,  గౌతమ్ వాసుదేవ్ మీనన్ ని ఎంపిక చేసుకున్నట్లు ,  సంగీత దర్శకుడుగా అనిరుద్ రవిచంద్రన్ ఇప్పటికే ఓకే చేసినట్లు తెలుస్తోంది. ఇలా తలపతి విజయ్ 67 వ మూవీ కోసం లోకేష్ కనకరాజు ఇప్పటికే అదిరి పోయే కాస్ట్ అండ్ క్రూని సిద్ధం చేసినట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: