ఈ మధ్య కాలంలో బ్యాక్ టు బ్యాక్ బిగ్ షాక్ లని సొంతం చేసుకన్న యంగ్ హీరో ఎవరైనా వున్నారా అంటే అది అక్కినేని వారబ్బాయి నాగచైతన్యనే. రీసెంట్ గా నాగచైతన్య నటించి భారీ అంచనాలు పెట్టుకున్న `థాంక్యూ` భారీ ఆశలతో అమీర్ ఖాన్ తో కలిసి బాలీవుడ్ లో అడుగు పెట్టాలని చేసిన `లాల్ సింగ్ చడ్డా` ఊహించని విధంగా డిజాస్టర్ లుగా నిలిచి షాకిచ్చాయి. ఆగస్టు 11న విడుదలైన `లాల్ సింగ్ చడ్డా`కు బాయ్ కాట్ బాలీవుడ్ ట్రెండ్ పెద్ద అడ్డింకిగా నిలిచింది.


ఇక `థాంక్యూ` మూవీలో కంటెంట్ లేకపోవడంచ నాగచైతన్య నటించిన పలు సినిమాలని మళ్లీ చూసిన ఫీలింగ్ కలగడంతో ఈ మూవీని ప్రద్శిస్తున్న థియేటర్లకు ప్రేక్షకులు రావడానికి ఆసక్తిని చూపించలేదు. 1 టికెట్ కి మరో టికెట్ ఫ్రీ అంటూ థియేటర్ల వద్ద ప్రచారం చేసినా ఈ మూవీకి ఆశించిన స్థాయి ఆదరణ దక్కలేదు. దీంతో ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో ఓ బాలీవుడ్ మీడియాతో ముచ్చటించిన నాగచైతన్య పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించాడు.  

మారుతున్న సమీకరణాలు సినిమాలపై ప్రేక్షకుడికి పెరిగిన అవగాహణ ఓటీటీల ప్రభావం నేపథ్యంలో ఇకపై భాష అవరోధంగా నిలిచే అవకాశం లేదన్నాడు. ఓటీటీల ప్రభావం బాగా పెరిగిన నేపథ్యంలో అంతా సబ్ టైటిల్స్ తో సినిమాలని చూస్తున్నారన్నాడు. అంతే కాకుండా రీమేక్ సినిమాలపై కూడా చైతూ ఆసక్తికరంగా స్పందించాడు. కంటెంట్ వున్న సినిమాలే ఆడుతున్న నేపథ్యంలో రీమేక్ సినిమాలు ఆకట్టుకునే ప్రసక్తి లేదన్నాడు.

బాలీవుడ్ లో మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నానని అటు వైపుగా ఆవకాశాల కోసం చూస్తున్నానని అక్కడ చాలా మంది మేకర్స్ వున్నారని వారితో కలిసి పని చేయాలనుకుంటున్నానని స్పష్టం చేశాడు. బాలీవుడ్ తో పాటు నాకు ఆసక్తిని కలిగించే కథ ఏ భాషలో లభించినా అందులో నటించడానికి నేను రెడీ అన్నాడు. అంతే కాకుండా ఇకపై ప్రయోగాత్మక పాత్రల్లో నటించాలని అనుకుంటున్నానని తెలిపాడు.

మేకర్స్ తమ సినిమాలని ప్రేక్షకులకు చేరువ చేయడానికి ప్రయత్నించడం కంటే వారికి ఇష్టమైన కంటెంట్ తో సినిమాలు చేస్తే బాగుంటుందన్నాడు. అన్నిరకాల సంస్కృతులు ఎమోషన్స్ మనకున్నాయని వాటిని ప్రతిబింబించే సినిమాలు ఆదరించడానికి ప్రేక్షకులు ఎప్పుడూ సిద్ధంగా వున్నారని తెలిపాడు. చై మాటలు విన్నవారంతా రెండు సినిమాల ఫ్లాప్ తో ఎంత మార్పు అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు చైతన్య పూర్తిగా మంచి స్క్రిప్ట్ కోసం చూస్తున్నాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: