విజయ్ దేవరకొండ హీరోగా నటించిన గత మూడు సినిమాలు ప్రేక్షకులను ఏమాత్రం అలరించలేక పోయినా కూడా ఆయన క్రేజ్ కు వచ్చిన డోకా ఏం లేదు. అంతకంతకు ఆయనకు ప్రేక్షకులలో భారీ స్థాయిలో క్రేజ్ పెరిగిపోతుంది. సినిమాల ద్వారా కాకుండా తన ప్రవర్తనతో ప్రేక్షకులను ఆకర్షించే ఈ హీరో అయిన విజయ్ దేవరకొండ ఇప్పుడు సినిమాతో కూడా విజయం సాధిస్తే వేరే స్థాయిలో ఉంటుంది అనేది ఆయన అభిమానులు చెబుతున్న మాట.

ఆ విధంగా ఎన్నో అంచనాలను పెట్టుకొని చేసిన సినిమా ప్రేక్షకులను ఏమాత్రం నిరాశపరచకపోవడం ఒక్కసారిగా అందరిలో బాధను కలిగిస్తుంది. అయితే ఈ హీరోకి ఉన్న క్రేజ్ దృష్ట్యా చాలా మంది అగ్ర దర్శకులు ఆయనతో సినిమా చేయడానికి క్యులు కడుతూ ఉండడం విశేషం. ప్రస్తుతం ఆయన ఖుషి అనే సినిమా చేస్తూ ఉండగా ఈ చిత్రం తర్వాత ఆయన చేతిలో అరడజను మంది దర్శకులు ఉండడం ఆయనకు ఎంతటి స్థాయిలో డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రంగం సిద్ధం చేశాడట.

త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రాబోతుంది. సుకుమార్ లాంటి అగ్ర దర్శకుడు తో సినిమా చేయడానికి ఇప్పటికే ఒప్పందం చేసుకున్న నేపథ్యంలో త్వరలోనే ఈ హీరో బాలీవుడ్ చిత్ర దర్శకులతో కూడా సినిమాలు చేయడానికి రంగం సిద్ధమవుతోంది. ఈ మధ్యనే అక్కడ కొంతమంది బాలీవుడ్ దర్శకుల కథలు విని ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. మరి హిట్టు వచ్చిన హీరోల్లాగానే ఆయన వెంట పడుతున్న అగ్ర హీరోలు అందరితో కనుక విజయ్ దేవరకొండ సినిమా చేస్తే తప్పకుండా ఆయన భవిష్యత్తులో టాలీవుడ్ నెంబర్ వన్ హీరో అయ్యే అవకాశం ఉంది. మరి ఆయనకు కోరుకున్న విజయం దక్కి పెద్ద హీరో గా ఎదుగుతాడా లేదా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: