మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తదుపరి సినిమా విషయంలో మెగా అభిమానులు ఎంతో అయోమయానికి గురవుతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఈ హీరో శంకర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ దర్శకుడు హుటాహుటిన కమలహాసన్ సినిమా కోసం వెళ్లిపోవడం ఇప్పుడు చరణ్ ఏ సినిమా చేస్తున్నాడు అన్న క్లారిటీ లేకుండా అయిపోయింది. తొందరలోనే మెగా పవర్ స్టార్ చేయబోయే తదు పరిశ్రమ పై క్లారిటీ వస్తుంది అని చెబుతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో ఆయన చేయబోయే సినిమాలకు సంబంధించి కొంత గందరగోళం నెలకొంటుంది.

మొదటినుంచి చరణ్ ఏర్పరచుకున్న లైనప్ చాలా బాగుందని మెగా అభిమానులు చెప్పుకొచ్చారు. శంకర్ సినిమా తర్వాత జాతీయ స్థాయి అవార్డు అందుకున్న గౌతం తిన్ననూరి దర్శకత్వంలో చరణ్ ఓ సినిమా చేయాలనుకున్నారు. కొన్ని రోజులుగా ఈ సినిమా లేదని వార్తలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో చరణ్ దీనిపై ఓ క్లారిటీ ఇవ్వకపోవడం నిజంగా వారిని కలవడానికి గురిచేస్తుంది. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ అలాగే విక్రమ్ సినిమాతో భారీ విజయం అందుకున్న లోకేష్ కనకరాజు వంటి దర్శకులతో కూడా చరణ్ ఓ సినిమా చేయబోతున్నాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఇంతమంది దర్శకులను చేసుకున్న రామ్ చరణ్ ఎవరితో సినిమా చేయబోతున్నాడు అనే ప్రకటనను కూడా ఇస్తే బాగుంటుంది అనేది మెగా అభిమానులు కోరుకుంటున్న విషయం. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ ఇచ్చే విధంగా పవర్ స్టార్ తన సినిమా బృందానికి సూచించాడట. ప్రస్తుతం ఆయన పూర్తి దృష్టి శంకర్ దర్శకత్వంలో చేయబోయే సినిమా పైనే పెట్టాడు. ఈ సినిమా యొక్క షూటింగ్ శేరవేగంగా జరుగుతుంది. కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తుండగా ఈ సినిమా పై మెగా అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. జాతీయ స్థాయి లోనే ఈ సినిమా విడుదల కాబోతుంది. ఈ సినిమా తర్వాత పలువురు దర్శకులు లైన్ లో ఉన్నా ఎవరి గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: