లైగర్ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ ఓ ప్రేమకథ సినిమా చేస్తున్న నేపథ్యంలో ఆ తర్వాత ఎవరితో విజయ్ దేవరకొండ సినిమా చేస్తు న్నాడు అన్న ఆసక్తి ఇప్పుడు ప్రతి ఒక్కరిలో నెలకొంది. అసలే వరుస ప్లాపులతో సతమతమవుతున్న ఈ హీరో ఏ విధంగా హిట్ ట్రాక్ ఎక్కుతాడో అన్న సంశయం ఆయన అభిమానులతో పాటు ప్రేక్షకులలో కూడా ఉంది. ఆ విధంగా ఒక హిట్ ఇచ్చే దర్శకుడుతో ఆయన సినిమా చేయాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు.

ప్రమోషన్ చేసే విధానంలో విజయ్ దేవరకొండను మించిన వారు లేరు. కొన్ని కొన్ని సార్లు అది మిస్ ఫైర్ అవుతుంది కూడా ఏదేమైనా సినిమాను భారీ స్థాయిలో ప్రేక్షకులకు చేరవేయగల సత్తా ఉన్న హీరో విజయ్ దేవరకొండ అనే చెప్పాలి. అయితే ఆయనకు ఎప్పుడు వస్తూ ఉంటుంది కొంత మంది కావాలని ఆయనపై నెగెటివిటీ చేస్తూ ఆయన సినిమాలు మంచి కలెక్షన్లు రాకుండా ఉండాలని చూస్తూ ఉంటారు ఖుషీ సినిమాతో దానిని తగ్గించాలని ఆయన గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. 

ఇదిలా ఉంటే ఆయన తన తదుపరి సినిమాను మాస్ దర్శకులతో చేయాలనే ఆలోచిస్తున్నాడు గత కొద్దిరోజులుగా ఆయన హరీష్ శంకర్ దర్శకత్వం లో ఓ సినిమా చేయడానికి ఆలోచన చేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై ఓ స్పష్టత రానుంది అంతేకాకుండా కొంతమంది యువ దర్శకుల తో కూడా ఆయన సినిమాలు చేసే విధంగా రంగం సిద్ధం చేసుకుంటున్నాడు ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ తదుపరి సినిమా ఎవరితో ఉన్నా కూ డా అది భారీ స్థాయి లో విజయాన్ని అందుకోవా లని ఆయన అభిమానులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఖుషి సినిమా పనులలో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ తొం దర్లోనే తన తదుపరి సినిమాకు సంబంధించిన అప్డేట్ విడుదల  చేయనున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: