టాలీవుడ్ సినిమా పరిశ్రమలో మంచి క్రేజ్ కలిగి ఉన్న పూజ హెగ్డే మరియు కీర్తి సురేష్ ఇద్దరు కూడా ప్రస్తుతం తెలుగులో అగ్ర హీరోయిన్ లు గా ఉన్నారని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే వీరిద్దరూ గత కొన్ని సినిమాలుగా వరుస ఫ్లాప్ లను అందుకోవడం వారి అభిమానులను ఎంతగానో కలవర పెట్టిస్తుంది. దీనికి తోడు కొంతమంది సినిమా విశ్లేషకులు కూడా ఈ హీరోయిన్ ల పని అయిపోయింది అనే రకంగా మాట్లాడుతూ ఉండడం వారిని మరింత కలవరపెడుతుంది అని చెప్పాలి.

కీర్తి సురేష్ ఇప్పుడిప్పుడే కమర్షియల్ సినిమాలు చేస్తూ తన అభిమానులతో పాటు ప్రేక్షకులను కూడా ఎంతగానో అలరిస్తుంది. పూజా హెగ్డే కొన్ని వెరైటీ పాత్రలు చేయడానికి వెళ్లి చేతులు కాల్చుకుంది. ఆ విధంగా వీరిద్దరూ ఏదో ఒక రకంగా సినిమాలతో ప్రేక్షకులను ఏమాత్రం అలరిం చకపోవడం నిజంగా వారి కెరియర్ చివరి దశకు వచ్చిందా అన్న అనుమానాలను కలిగిస్తుంది. ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో కొత్త హీరోయిన్ ల రాకతో గ్లామర్ ప్రపంచంలో మంచి జోష్ నెలకొంది.

ఈ నేపథ్యంలోనే చూసిన అందాలను చూడడానికి బోర్ కొట్టేసినట్లుగా ప్రేక్షకులు వీరి సినిమాలను ఆదరించకపోవడం వారు సినిమాలు ఇంకా చేయాలి అని చెప్పడానికి ఉదాహరణగా మారుతుంది. ఇప్పుడు కూడా వీరిద్దరూ కొన్ని సినిమాలలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఏవైనా వారికి మంచి విజయాన్ని తెచ్చిపెడతాయి అనేది చూడాలి. మహేష్ బాబు సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది పూజ హెగ్డే. ఈ చిత్రం తప్ప ఆమె చేతిలో వేరే పెద్ద హీరో సినిమా ఏదీ లేదని చెప్పాలి. ఈ సినిమా మంచి విజయం సాధిస్తే తప్ప ఆమెకు అవకాశాలు రావని చెప్పవచ్చు. కీర్తి సురేష్ కూడా ఇటీవల సర్కారు వారి పాట పూర్తి చేసిన తర్వాత మరే పెద్ద సినిమా కూడా ఒప్పుకోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: