సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ని ఆగస్టు నెల నుండి ప్రారంభించ నున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితం అధికంగా ప్రకటించింది. కాక పోతే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మూవీ షూటింగ్ ఆగస్టు నెలలో ప్రారంభించ లేదు. ఇది ఇలా ఉంటే తాజాగా సెప్టెంబర్ నెలలో ఈ మూవీ షూటింగ్ అధికారికంగా ప్రారంభం అయ్యంది. ఈ మూవీ షూటింగ్ యాక్షన్ సన్నివేశాలతో ప్రారంభం అయ్యింది.  

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ షూటింగ్ కు సంబంధించిన అప్డేట్ ను చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. తాజాగా ఈ మూవీ యూనిట్ సోషల్ మీడియా వేదికగా ఈ మూవీ షూటింగ్ అప్డేట్ ను తెలియజేస్తూ ...  సూపర్ స్టార్ మహేష్ బాబు 28 వ సినిమాకు సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ విజయవంతంగా పూర్తి అయింది.  ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ లో భాగంగా అదిరి పోయే యాక్షన్ ఎపిసోడ్ లను చిత్రీకరించాం. సెకండ్ షెడ్యూల్ షూటింగ్ దసరా తర్వాత ప్రారంభం అవుతుంది. ఈ సెకండ్ షెడ్యూల్ షూటింగ్ లో బుట్ట బొమ్మ పూజ హెగ్డే కూడా పాల్గొనబోతుంది అని చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు , త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూడవ మూవీ కావడంతో ఈ సినిమాపై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం ఏప్రిల్ 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: