మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ వంటి స్టార్ బ్యానర్ లో వచ్చిన `ఉప్పెన` సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన యంగ్ బ్యూటీ కృతి శెట్టి.. ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఆ వెంటనే `శ్యామ్ సింగరాయ్‌`, `బంగార్రాజు` చిత్రాలతో వరుస హిట్లను తన ఖాతాలో వేసుకొని ఇండస్ట్రీలో అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకుంది.యూత్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది.ఇక ఈ క్రమంలోనే ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తాయి. అయితే ఆఫర్లతో పాటు కృతి శెట్టి కి బ్యాడ్ టైం కూడా మొదలైంది.జూలై నెలలో `ది వారియర్`, ఆగస్టు నెలలో `మాచర్ల నియోజకవర్గం`, సెప్టెంబర్‌ నెలలో `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`.. మొత్తంగా కృతి శెట్టి మూడు నెలల్లో మూడు చిత్రాలతో ప్రేక్షకులను పలకరించింది. అనూహ్యంగా ఈ మూడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద చాలా దారుణంగా బొక్కబోర్లా పడ్డాయి. హ్యాట్రిక్ హిట్స్ తర్వాత హ్యాట్రిక్ ఫ్లాపుల పడటంతో తీవ్ర నిరాశలో మునిగిపోయిన కృతి శెట్టి.. ఇకపై కెరీర్ పరంగా ఆచితూచి అడుగులు వేయాలని డిసైడ్ అయ్యిందట.


ఆమెకు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలోనే ఆమె ఆస్తుల వివరాలు కూడా తెరపైకి వచ్చాయి. ఇంతకీ ఈ కృతి శెట్టి ఎన్ని కోట్లకు వారసురాలో తెలిస్తే దిమ్మతిరుగుద్ది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 2003లో కృష్ణ శెట్టి, నీతి శెట్టి దంపతులకు మంగళూరులో జన్మించిన కృతి శెట్టి ముంబై లో పెరిగింది.కృతి శెట్టి తండ్రి పలు వ్యాపారాలు చేస్తూ భారీగా సంపాదిస్తున్నారు. అలాగే తల్లి ఫ్యాషన్ డిజైనర్. తల్లి ప్రోత్సాహంతో మోడలింగ్ లోకి అడుగు పెట్టిన కృతి శెట్టి.. పలు యాడ్స్ లో కూడా నటించింది. ఈ సమయంలో ఆమెకు `ఉప్పెన` సినిమాలో అవకాశం వచ్చింది. కృతి శెట్టికి ముంబై, బెంగుళూరు లో సొంత ఇళ్లు, స్థలాలు ఉన్నాయి. అలాగే ఆమెకు రూ. 42 లక్షల విలువైన ఆడి ఏ4, రూ. 17 లక్షల విలువైన హొండా, రూ.31 లక్షల విలువైన టొయోట ఫార్ట్యూన్ కార్లు ఉన్నాయి. మొత్తంగా కృతి శెట్టి ఆస్తి విలువ దాదాపు రూ. 30 కోట్ల వరకు ఉంటుందట. ఇక ఈ బ్యూటీ ఒక్కో సినిమాకు రూ. 1.5 కోట్ల నుంచి 2 కోట్ల వరకు రెమ్యునరేషన్ పుచ్చుకుంటోందని సమాచారం తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: