కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ప్రస్తుతం హెచ్ వినోద్ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్న సంగతి తెల్సిందే. ఆ సినిమాను అజిత్ ఫ్రెండ్ బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోణీ కపూర్ నిర్మిస్తున్నాడు.వీరి ముగ్గురి కాంబినేషన్ లో రూపొందుతున్న మూడో సినిమా ఇది కావడం విశేషం. మొదటి రెండు సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకోగా ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి.అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుందని దర్శకుడు హెచ్ వినోద్ చెప్పుకొచ్చాడు. తాజాగా ఈ సినిమా  టైటిల్ ను అనౌన్స్ చేయడంతో పాటు అజిత్ కుమార్  ఫస్ట్ లుక్ ను కూడా రివీల్ చేయడం జరిగింది. సినిమా కి తునివు అనే టైటిల్ ను ఖరారు చేయడం జరిగింది. దృడత్వం అనే అర్థం వచ్చే ఈ టైటిల్ అజిత్ అభిమానులకు మస్త్ గా నచ్చేసిందట.ఇక సినిమాలోని అజిత్ లుక్ కి కూడా ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఫస్ట్ లుక్ లో అజిత్ చాలా స్టైలిష్ గా మిషన్ గన్ పట్టుకుని ఉన్న స్టిల్ కి అంతా కూడా వావ్ అంటున్నారు. అయితే ఇదే సమయంలో ఆయన లుక్ విషయంలో కొందరు యాంటి ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తున్నారు.


ముఖ్యంగా యాంటీ ఫ్యాన్స్ అయిన విజయ్ ఫ్యాన్స్ అజిత్  ఓల్డ్ లుక్ ని ట్రోల్స్ చేస్తూ ఉన్నారు.తెల్ల జుట్టు, తెల్ల గడ్డం ముసలి హీరో మళ్లీ రాబోతున్నాడు అంటూ యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాలోని ఆయన లుక్ ను చాలా మంది చాలా రకాలుగా విమర్శిస్తున్నారు. గతంలో ఇలాంటి లుక్ లో అజిత్ కనిపించిన సమయంలో కూడా యాంటీ ఫ్యాన్స్ ట్రోల్స్ చేయడం జరిగింది. వలిమై సినిమాలో మంచి యంగ్ లుక్ లో కనిపించిన అజిత్ ఇప్పుడు మళ్లీ ఇలా తెల్ల వెంట్రుకలతో ఓల్డ్ లుక్ లో కనిపించబోతున్న నేపథ్యంలో ఫ్యాన్స్ లో కూడా కొందరు పెదవి విరుస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.మొత్తానికి సోషల్ మీడియాలో తునివు సినిమా గురించి చర్చ బాగా జరుగుతూ ఉంది. అందువల్ల సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. ఈ సినిమాలో మంజు వారియర్ కీలక పాత్రలో నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: