టాలీవుడ్ కుర్ర విజయ్ దేవరకొండ ఓవర్ కాన్ఫిడెన్స్ తో నటించిన లేటెస్ట్ సినిమా `లైగర్`. సీనియర్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య విడుదలై ఫస్ట్ డే ఫస్ట్ షోకే డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకుని హీరో విజయ్ దేవరకొండకు దర్శకుడు పూరి జగన్నాథ్ కు దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యే షాకిచ్చింది.ఈ సినిమాతో ఇండియాని షేక్ చేద్దామనుకున్న విజయ్ కి పూరికి జనాలు ఊహించని షాక్ ఇచ్చారు.ఈ మూవీ తరువాత చాలా వరకు అన్నీ మారిపోయాయి. విజయ్ దేవరకొండతో పూరి జగన్నాథ్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ `జనగణమన`ని ప్రారంభించాడు. ఓ షెడ్యూల్ ని ముంబైలో పూర్తి చేశారు కూడా. అయితే `లైగర్` ఫలితంగా ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని గత కొన్ని రోజులుగా వరుస కథనాలు వినిపిస్తున్నాయి. దీనిపై పూరి కానీ విజయ్ దేవరకొండ కానీ క్లారిటీ ఇవ్వకపోవడం.. ఇటీవలై సైమా వేడుకల్లోనూ విజయ్ దేవరకొండ ఈ ప్రాజెక్ట్ గురించి ఇండైరెక్ట్ గా స్పందించడంతో ఈ ప్రాజెక్ట్ ఇక అటకెక్కినట్టేనని తేలింది.


ఇదిలా వుంటే విజయ్ దేవరకొండ ప్రస్తుతం `ఖుషీ` మూవీలో నటిస్తున్నాడు. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. కశ్మీర్ లో షూటింగ్ మొదలు పెట్టిన ఈ మూవీ కీలక ఘట్టాలని పూర్తి చేసి చిత్ర బృందం హైదరాబాద్ తిరిగి వచ్చేసింది. ఇక్కడ కొన్ని సీన్ లు చేశారు. నెక్స్ట్ షెడ్యూల్ ప్రారంభం కావాల్సి వుంది. అయితే సమంత యుఎస్ వెళ్లిన నేపథ్యంలో ఈ మూవీ షూటింగ్ కు బ్రేక్ పడింది.ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండకు సంబంధించిన క్రేజీ ప్రాజెక్ట్ ఆగినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. సుకుమార్ డైరెక్షన్ లో తెలంగాణ సాయుధ పోరాటం నేపథ్యంలో ఓ భారీ పీరియాడికల్ మూవీని చేయాలని ప్లాన్ చేశారు. 2021లో ఈ ప్రాజెక్ట్ ని ప్రకటించారు. ఫాల్కన్ క్రియేషన్స్ బ్యానర్ పై కేదార్ సెలగం శెట్టి నిర్మాతగా ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ని 2022లో సెట్స్ పైకి తీసుకెళతామని ప్రకటించారు. కానీ ఇంత వరకు దీని గురించి ఎలాంటి ప్రకటన లేకపోవడం.. సుకుమార్ `పుష్ప 2 ` ప్రాజెక్ట్ తో బిజీగా వుండటంతో ఇప్పట్లో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: