టాలీవుడ్ లో యంగ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్ ఇటీవల 'కార్తికేయ2′ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమా ను బాలీవుడ్ లో కూడా రిలీజ్ చేస్తే అక్కడ కూడా మంచి హిట్ అయింది.


దీంతో తన సినిమాలకు బాలీవుడ్ లో మార్కెట్ ఏర్పడిందని భావిస్తున్న నిఖిల్.. అక్కడ తన మార్కెట్ పరిధిని పెంచుకోవాలనుకుంటున్నారు. నిఖిల్ ఇదివరకు '18 పేజెస్' అనే సినిమాలో నటించారు. ఆ సినిమాను అక్టోబర్ లేదా నవంబర్ లో విడుదల చేయాలని నిర్మాతలు కూడా ప్లాన్ చేశారు.


కానీ ఇప్పుడు ఆ సినిమా ను రీషూట్ చేయాలని నిఖిల్ అడగడంతో.. బాలీవుడ్ ఆడియన్స్ కు నచ్చే విధంగా ఆ సినిమాలో కొన్ని సీన్లు, ఫైట్స్ పెట్టబోతున్నారు. అలానే నిఖిల్ 'స్పై' అనే మరో సినిమా కూడా ఒప్పుకున్నారు. దానికి సంబంధించిన షూటింగ్ కూడా జరిగింది. ఇదొక యాక్షన్ థ్రిల్లర్. ఇప్పుడు ఈ సినిమాను కూడా చాలా వరకు రీషూట్ చేయబోతున్నారట. బాలీవుడ్ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు తన సినిమాలను మార్చాలని భావిస్తున్నారట నిఖిల్.


 


కొత్తగా ఒప్పుకునే సినిమాలన్నీ కూడా భారీగా ఉండాలని కోరుకుంటున్నారట నిఖిల్. ఇప్పటికే తన రెమ్యునరేషన్ కూడా పెంచారు. 'కార్తికేయ2'తో వచ్చిన సక్సెస్ ను క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు నిఖిల్. అయితే ఇప్పుడు '18 పేజెస్', 'స్పై' సినిమాలకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది..? ఎంతవరకు కలెక్షన్స్ సాధిస్తాయి అనేదాన్ని బట్టి నిఖిల్ ఫ్యూచర్ మార్కెట్ ఆధారపడి ఉంటుంది.


 


ప్రస్తుతానికైతే దర్శకనిర్మాతలు నిఖిల్ అడుగుతున్నట్లుగా మార్పులు, చేర్పులు చేయడానికి అయితే రెడీ అవుతున్నారు. ఇవి గనుక హిట్ అయితే నిఖిల్ టాప్ రేంజ్ కి చేరుకోవడం అయితే ఖాయం.మరి టాలీవుడ్ మసాలాను అలవాటు పడిన బాలీవుడ్ ప్రేక్షకులకు కొత్తగా తెలుగు సినిమా ను అలవాటు చేయక్కరలేదు. మన సినిమాలో దమ్ముంటే మార్పులు చేయకపోయిన విజయం సాధిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: