ఒక హీరోకి కథ చెప్పాలంటే ఇండస్ట్రీలో చాలా రూల్స్ ఉంటాయి. పెద్ద హీరోలకు కథ చెప్పాలంటే.. ముందుగా మేనేజర్స్ కి లేదంటే అసిస్టెంట్స్ కి కూడా చెప్పాల్సి ఉంటుంది


కథ వారికి నచ్చితే అప్పుడు హీరోలు రంగంలోకి దిగుతారు. దాదాపు అందరి హీరోల విషయంలో ఇలానే జరుగుతుంది. ఎందుకంటే వచ్చిన ప్రతీ కథను వినేంత టైం వారికి ఉండదు. యంగ్ హీరో విజయ్ దేవరకొండ విషయంలో కూడా ఇంతేనట. అయితే ఈ మధ్య ఆయన తండ్రి వర్ధన్ రంగంలోకి దిగారని..


విజయ్ కి కథ చెప్పాలంటే ముందు ఆయనకు చెప్పాలని వార్తలొస్తున్నాయి. ఆయన ఓకే చేస్తేనే విజయ్ వరకు కథ వెళ్తుందని ప్రచారం అయితే జరుగుతుంది. నిజానికి స్టార్ హీరోలు.. తమ కొడుకులకు సంబంధించిన సినిమాల విషయంలో ఇన్వాల్వ్ అవుతుంటారు. కథ కూడా వారికి నచ్చితేనే ప్రొసీడ్ అవ్వమంటారు. ఇప్పుడు విజయ్ విషయంలో తన తండ్రి ఇన్వాల్వ్ అవుతున్నాడని ప్రచారం జరుగుతుండడంతో.. వర్ధన్ కి ఫోన్ కాల్స్ వెళ్తున్నాయట. ఈ విషయంపై ఆయన స్వయంగా క్లారిటీ ఇచ్చారట.


 


మీడియా ఛానెల్ తో మాట్లాడిన ఆయన.. విజయ్ కథలన్నీ తను వింటున్నానని అనడంలో ఎలాంటి నిజం లేదని.. విజయ్ కి కథలపై మంచి జడ్జిమెంట్ ఉందని అన్నారు. విజయ్ తన కథలన్నీ స్వయంగా వింటాడని.. ఎప్పుడైనా ఆ కథల గురించి తనతో చర్చిస్తాడే.. తప్ప అంతకుమించి తన ప్రమేయం ఉండదని ఆయన అన్నారు.


 


విజయ్ తో సినిమాలు తీస్తున్న నిర్మాతలకు, దర్శకులకు కథల గురించి బాగా తెలుసనీ.. కాబట్టి విజయ్ కథల విషయంలో తను ఇన్వాల్వ్ అవ్వనని చెప్పారు. దీన్ని బట్టి విజయ్ తండ్రి వర్ధన్ పై జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని తేలిపోయిందట. విజయ్ తన సొంత టాలెంట్ తో ఏదిగాడని తన కుటుంబ సపోర్ట్ కూడా ఉందని కానీ అంతకంటే ఎక్కువ లేదని ఆయన తేల్చి చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: