మోస్ట్ గ్లామరస్ బ్యూటీ అయినటువంటి శ్రీ నిధి శెట్టి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మడలింగ్ ఫీల్డ్ నుండి సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దు గుమ్మ తన కెరియర్ లో మొట్ట మొదటి మూవీ గా కే జీ ఎఫ్ మూవీ లో నటించింది. 

కే జి ఎఫ్ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో ఈ ముద్దు గుమ్మ కు పాన్ ఇండియా రేంజ్ లో అద్భుతమైన క్రేజీ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా శ్రీ నిధి శెట్టి 'కోబ్రా' మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లో చియన్ విక్రమ్ హీరోగా నటించిన మూవీ కి అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించాడు. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ థియేటర్ లలో విడుదల అయ్యింది. 

ఇది ఇలా ఉంటే శ్రీ నిధి శెట్టి సోషల్ మీడియాలో కూడా అదిరి పోయే రేంజ్ లో యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అలాగే ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. కొంత కాలం క్రితమే ఈ ముద్దు గుమ్మ బ్లూ కలర్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది.  ఈ ఫోటోలు చాలా రోజుల పాటు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

ఇది ఇలా ఉంటే తాజాగా శ్రీ నిధి శెట్టి తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో శ్రీ నిధి శెట్టి అవుట్ అండ్ అవుట్ రెడ్ కలర్ లో ఉన్న డ్రెస్ ని వేసుకొని  అందుకు తగిన రెడ్ కలర్ లో ఉన్న బ్లౌజ్ ని ధరించి , మెడలో రెడ్ కలర్ లో ఉన్న లాకెట్ ను వేసుకొని అదిరిపోయే యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం శ్రీ నిధి శెట్టి కి సంబందించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: